కొడుకును సీఎం చేసుకోలేక‌పోతున్నాన‌నే ఫ్రెస్ట్రేష‌న్ లో కేసీఆర్‌.

Update: 2021-11-10 02:30 GMT
త‌న కుమారుడు, మంత్రి కేటీఆర్‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం లేద‌ని.. అందుకు ఆయ‌న స‌మ‌ర్ధుడు కాలేక పోతున్నార‌నే ఫ్రెస్ట్రేష‌న్ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లో పెరిగిపోయింద‌ని.. అందుకే ఆయ‌న బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కుడు కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్లు చేశారు. అంతేకాదు.. హుజూరాబాద్ ఓట‌మి దెబ్బ‌తో కేసీఆర్ ర‌గిలిపోతున్నార‌ని అన్నారు. కేసీఆర్ మాట‌ల్లో పుత్ర‌వాత్సల్యంతో కూడిన ఫ్రెస్ట్రేష‌న్ క‌నిపిస్తోంద‌న్నారు. ``త‌న కొడుకును ముఖ్య‌మంత్రి చేసుకోలేన‌ని, భ‌విష్య‌త్తులో ఇది జ‌రిగే ప‌నికాద‌ని.. కేసీఆర్‌కు అర్ధ‌మైంది. అందుకే మాపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు`` అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ప్ర‌జ‌లు టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని తిర‌స్క‌రించ‌డం.. డ‌బ్బు, మ‌ద్యం స‌హా ఎన్ని ప్ర‌లోభాల‌కు గురి చేసినా.. ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌క‌పోవ‌డం వ‌ల్లే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నార‌ని.. కిష‌న్ రెడ్డి చెప్పుకొచ్చారు.  ఇక‌, ధాన్యం సేక‌ర‌ణ గురించి మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ నుంచి 43 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 94 మెట్రిక్‌ టన్నులు సేకరించింద‌ని కిషన్‌రెడ్డి వివరించారు. పంజాబ్ తరువాత, తెలంగాణ రెండవ అతిపెద్ద రాష్ట్రంగా బాయిల్డ్ రైస్ సేక‌ర‌ణ జ‌రుగుతోంద‌న్నారు.

ఇక‌, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను కిష‌న్ రెడ్డి స‌మ‌ర్ధించుకున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల హెచ్చుతగ్గులు ఉన్నాయని తెలిపారు. ''కేంద్రం అనేక పథకాలకు నిధులు వెచ్చిస్తోంది. మేము కోవిడ్-19 లాక్‌డౌన్ నుండి ఉచిత రేషన్ అందిస్తున్నాము. ఉచితంగా వ్యాక్సిన్‌లను అందజేస్తున్నాము. జిఎస్‌టి వసూళ్లు తగ్గినప్పుడు, జిఎస్‌టి తగ్గింపును భర్తీ చేయడానికి మేము సెస్‌ని విధించా'' అని కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి రాష్ట్రాల‌కు ఏం సంబంధం? అని ప్ర‌శ్నించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. త‌మ‌కు మెడిక‌ల్ కాలేజీలు ఒక్క‌టి కూడా కేటాయించ‌లేద‌న్న విమ‌ర్శ‌పై స్పందిస్తూ.. కేంద్రం అన్ని రాష్ట్రాల‌కు కొన్ని నివేదిక‌లు పంపింద‌ని.. 60 శాతం కేంద్ర నిధుల‌తో మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటు విష‌యాన్ని ప్ర‌స్తావించింద‌ని.. అయితే.. ఈ విష‌యాన్ని కేసీఆర్ ప్ర‌భుత్వం ఎప్పుడూ ప‌ట్టించుకోలేద‌ని చెప్పారు. క‌నీసం సెక్ర‌టేరియ‌ట్‌కు కూడా ఆయ‌న ఎప్పుడూ వెళ్ల‌లేద‌ని.. దీనిపై ఆయ‌న‌కు అవ‌గాహ‌న లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. క‌నీసం దీనిపై గ‌తంలో ఏమైనా లెట‌ర్ కూడా రాయ‌లేద‌ని తెలిపారు. కేసీఆర్ ఉడ‌త ఊపుల‌కు బీజేపీ భ‌య‌ప‌డ‌బోద‌ని కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. 
Tags:    

Similar News