కర్ణాటక సీఎం యడ్డీ దిగిపోవాలని అధిష్టానం ఆదేశం?

Update: 2021-06-11 09:30 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సీఎం కుర్చీకి ఎసరు వచ్చేలా కనిపిస్తోంది. ఆయనను పదవి నుంచి దిగిపోవాలని అధిష్టానం ఆదేశించినట్టు ఢిల్లీలోని బీజేపీ అత్యున్నత వర్గాలు ధ్రువీకరించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

 కర్ణాటకలో నాయకత్వ మార్పుపై పదిరోజులుగా వివాదం కొనసాగుతోంది. యడ్యూరప్ప పదవి వీడాలని పట్టుబడుతున్న నేతలను శాంతింపచేజేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి అరుణ్ సింగ్ ఈనెల 17,18 తేదీల్లో ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లనున్నారు.

గురువారం ఈ విషయంపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అరుణ్ సింగ్ కర్ణాటకలో సీఎం మార్పును కొట్టిపారేశారు. యడ్యూరప్ప ఉత్తమంగా పాలిస్తున్నారని.. కోవిడ్ ను చక్కగా నియంత్రిస్తున్నారని ప్రశంసించారు. సీఎం మార్పు అవసరం లేదన్నారు.బెంగళూరు వెళ్లి తాను సమస్యలు పరిష్కరిస్తానన్నారు.

ఇక నాయకత్వ మార్పుపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు. మార్పు ఉండబోదని అరుణ్ సింగ్ గట్టిగా చెబుతున్నప్పటికీ వచ్చేవారం తాను బెంగళూరు వెళ్లి అసంతృప్త నేతలను శాంతింప చేస్తానని చెప్పడంతో మార్పు తథ్యమనే సంకేతాలకు బలం చేకూరినట్టైంది.
Tags:    

Similar News