• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా విజృంభణ..మరో...

కరోనా విజృంభణ..మరో ప్రణాళికని సిద్ధం చేసిన కేంద్రం..ఏంటంటే ?

By - Tupaki Desk
Update: 2020-04-06 07:10 GMT
భారత్‌ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. దేశంలో కరోనాను అరికట్టడానికి లాక్ డౌన్ ను విధించినప్పటికీ కూడా ..కరోనా వేగంగా విస్తరిస్తుండటం తో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇకపోతే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,314 కరోనావైరస్‌ పాటిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 118 కు చేరింది. గడిచిన 12 గంటల్లోనే ఏకంగా 500  మందికి పైగా ఈ కరోనా వైరస్‌ సోకింది. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - మహారాష్ట్ర - కేరళతో సహా 9 రాష్ట్రాల్లోని 211 జిల్లాలలో కరోనా  కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో  బృహత్తర ప్రణాళికను సిద్దం చేసింది. కరోనావైరస్‌ మరిన్ని ప్రాంతాలకు కరనా విస్తరించే ప్రమాదం పొంచి ఉందనే అంచనాతో కేంద్ర ఆరోగ్య శాఖ వ్యూహాత్మక కార్యాచరణ సిద్ధం చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికలోని ముఖ్యాంశాలు :

ప్రస్తుతం పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో జన సంచారం లేకుండా చేయాలనీ తెలిపింది. అలాగే  ఆయా ప్రాంతాలకు పూర్తిగా రాకపోకల రద్దు చేయాలని తెలిపింది. చివరి కరోనా  కేసు నమోదైన తర్వాత 4 వారాల వరకు.. కొత్తగా ఏలాంటి పాజిటివ్ కేసు నమోదు కానట్లయితే అప్పుడు మాత్రమే ఆయా ప్రాంతాలలో నెమ్మదిగా సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే పాజిటివ్ కేసులుగా నమోదైన వారినందరినీ ఆస్పత్రులకు తరలించాలని చెప్పింది.

అలాగే , రెండు సార్లు జరిపే రక్త పరీక్షలు నెగటివ్‌ గా వస్తేనే ..పేషెంట్లను ఆసుపత్రుల నుంచి ఇళ్లకు పంపాలి అని , ఆలా కాకుండా  కొద్దిపాటి కోరనా లక్షణాలు ఉన్న వాళ్లని స్టేడియంలలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రాలకు పంపాలి అని , అలాగే  కొంచెం ఎక్కువ కరోనా లక్షణాలు ఉన్నవాళ్లను అసుపత్రులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులలో ఉంచాలి అని తెలిపింది. అలాగే  కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను దిగ్బంధం చేయడంతో పాటు ఆ ప్రాంతాల నుంచి పక్క ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందకుండా అంచెల వారి  రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి అని తెలిపింది.

ఇకపోతే , పాఠశాలలు - కళాశాలలు - ఇతర కార్యాలయాలను చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మూసివేయాలి. ఈ ప్రాంతాలలో ప్రభుత్వ - ప్రైవేట్ రవాణా ను స్తంభింప చేయాలి. కేవలం నిత్యావసర - అత్యవసర సర్వీసులను మాత్రం అనుమతించాలి అని తెలిపింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో .. వివిధ విధానాలను అవలంబించాలి. వైద్య సిబ్బంది - డాక్టర్లు - నర్సులు - పారా మెడికల్ సిబ్బందికి కట్టుదిట్టమైన సర్జికల్ గౌన్లు - మాస్కులు - గ్లోవ్స్ లాంటి ..మూడు రకాలైన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు వినియోగించాలి. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌ స్పాట్లు గా గుర్తించాలి. ఖచ్చితమైన చర్యలు తీసుకునే బాధ్యతను ..సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్లకు అప్పగించాలి.
Tags:    
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS