సంచయిత సవాల్.. రాజకీయవర్గాల్లో సంచలనం

Update: 2020-07-30 11:30 GMT
ఆరు నెలల్లోనే సంచయిత సత్తా చాటారు. తన బాబాయ్ అయిన దిగ్గజ టీడీపీ మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజుకే షాకిచ్చారు. ఆరు నెలల్లోనే ఇంత సాధించిన ఈమెను టీడీపీ, దాని అనుకూల మీడియా ఉత్సవ విగ్రహమంటూ.. వైసీపీ నామినేటెడ్ అంటూ విమర్శించారు. అలాంటి ఆమె ఆరు నెలల్లోనే చంద్రబాబు ఐదేళ్లలో చేయనిది.. అశోక్ గజపతిరాజు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చేయనిది చూసి చూపించి ఔరా అనిపించారు.

విజయనగరం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును దించేసి ఆయన స్థానంలో ఆయన అన్న ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె సంచయిత గజపతిరాజును సింహాచలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్ గా వైసీపీ ప్రభుత్వం నియమించింది.

అశోక్ గజపతి ముందు సంచయిత అనర్హురాలని.. పదవికి పనికిరాదంటూ టీడీపీ బ్యాచ్ విమర్శించారు.ఇప్పుడు అదే సంచయితే ఏకంగా కేంద్రాన్ని తన పనితనంతో ఒప్పించి ఏకంగా 53 కోట్ల రూపాయల కేంద్రం నిధులను సాధించారు. సింహాచలాన్ని వరల్డ్ నంబర్ 1 టెంపుల్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేకాదు సంచయిత కృషి కి కేంద్రం ప్రత్యేకంగా అభినందలు కురిపించడం విశేషం.

దీంతో ట్వీట్ చేసి మరీ సంచయిత.. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కానిది.. తన బాబాయ్ ఇన్నేళ్లలో చేయనిది తాను ఆరు నెలల్లోనే సాధించానంటూ సవాల్ చేశారు. సింహాచలాన్ని అభివృద్ధి చేసి వీరందరికీ గుణపాఠం నేర్పిస్తానంటూ సవాల్ చేశారు. సంచయిత సవాల్ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.
Full View
Tags:    

Similar News