రోజుకు లక్ష పరీక్షలు చేయాలన్న కేంద్రం.. ఓకే చెప్పిన తెలంగాణ
కరోనా వేళ.. తెలంగాణ రాష్ట్రం మీద మొదటి నుంచి ఉన్న ఒక అపవాదు.. పరీక్షలు తక్కువగా చేయటం. ఈ కారణంతోనే ఏపీతో పోలిస్తే తెలంగాణలో తక్కువ కేసులు నమోదైనట్లుగా చెబుతారు. ఒకవేళ అదే నిజమనుకున్నా.. కేసుల తీవ్రత ఎక్కువ ఉంటే.. పరీక్షలు తక్కువ చేసినప్పటికీ కేసుల నమోదు సంఖ్య ఎక్కువగా ఉండాలి కదా? అన్నది తెలంగాణ అధికారుల లాజిక్కు. ఏది ఏమైనా.. చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. కరోనా పరీక్షల విషయంలో ఇప్పటికి తక్కువగా చేసే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ పేరు కనిపిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 40వేల కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. అయితే.. ఈ తీరు మారాలని.. నిర్దారణ పరీక్షల్ని భారీగా పెంచాలని కేంద్రం కోరుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య.. కుటుంబ సంక్షేమ శాఖ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణలో నిర్దారణ పరీక్షలు రోజుకు లక్ష వరకు పెంచాలని కోరింది. ఇందుకు రాష్ట్ర అధికారులు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.
చలికాలంలో వైరస్ వ్యాప్తికి అవకాశం ఉండటంతో పరీక్షల్ని భారీ ఎత్తున పెంచనున్నారు. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో ఎక్కువ పరీక్షల్ని చేయాలని.. అందువల్ల వైరస్ ను ముందుగా గుర్తించే వీలుందంటున్నారు. అలా చేస్తే.. వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు. లక్షణాలు ఉండి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లోనెగెటివ్ వచ్చిన వారికి ఆర్ టీపీసీఆర్ పరీక్షలు చేయాలని కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకు చేస్తున్న పరీక్షల తీరుకు భిన్నంగా రోజుకు లక్ష చొప్పున కేసులు నమోదు చేస్తే.. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.