రాసలీల కేసు : ఆ యువతి కి నేను డబ్బు పంపించలేదు!

Update: 2021-04-05 09:57 GMT
కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాసలీలల సీడీ వ్యవహారం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ కేసులో విచారణ జరిగే కొద్ది వెలుగులోకి కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి. మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి తనపై అత్యాచారం చేశారని ఆరోపించిన యువతితో మాజీ మంత్రి డి.సుధాకర్‌ నగదు లావాదేవీలు నిర్వహించినట్లు సిట్‌ అధికారులు గుర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె బ్యాంకు ఖాతాకు 30 సార్లకు పైగా నగదు బదిలీ చేశారని, ఆ యువతి ఆయనకు ఫోన్‌ చేసి పలుసార్లు మాట్లాడారని గుర్తించారని తెలుస్తుంది. సోమవారం విచారణకు హాజరు కావాలని డి.సుధాకర్‌ కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనతో నిత్యం పలువురు మాట్లాడుతూ ఉంటారు.

తాను ఇప్పటి వరకు ఏ యువతితో అసభ్యంగా ప్రవర్తించలేదు. రాసలీలల వీడియో బయటపెట్టవద్దని న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవసరమూ లేదు.  నగదు పంపి ఉంటే ఇప్పటికే కోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు తెచ్చుకొనేవారమన్నారు. ఎస్ ‌ఐటీ అధికారులు తనను విచారణకు పిలిస్తే హాజరై సమాధానం చెబుతానన్నారు. తనకు మాజీ సీఎం సిద్దరామయ్య, రమేష్‌ జార్కిహొళి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్‌లతో మంచి సంబంధాలున్నాయన్నారు. ఎవరితోనూ రాజకీయ విభేదాలు లేవన్నారు. అయితే , యువతి కాల్‌ లిస్ట్‌ లో నిరుడు ఆగస్టు నుంచి నవంబరు మధ్యలో పలుసార్లు మాట్లాడుకున్నట్లు విచారణ అధికారులు గుర్తించారు. సీడీ బహిర్గతం కాకమునుపు ఆమెతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు.

రాసలీల సీడీలో ఉన్న యువతి నాలుగు నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంది. తమ అమ్మాయిని తమకు చూపాలని కుటుంబ సభ్యులు సిట్‌ కు విన్నపం చేశారు. సదరు యువతి అవ్వ విజయపుర జిల్లా నిడగుందిలో ఉంటోంది. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆ యువతి తల్లిదండ్రులు ఈనెల 1న నిడగుందికి వచ్చారు. అప్పటినుంచి వారు అక్కడే ఉంటున్నారు. ఈక్రమంలో సిట్‌ అధికారులను కలిసి తమ కుమార్తెను తమకు చూపించాలని కోరుతున్నారు.
Tags:    

Similar News