కర్ణాటక రాసలీలల కేసు .. హైకోర్టుకు యువతి లేఖ, రోజుకో ట్విస్ట్ !
కర్ణాటక రాజకీయాల్లో రాసలీలల సీడీ ఈ రేంజ్ లో కుదిపేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సీడీని అడ్డం పెట్టుకుని అధికార బీజేపీని శాసనసభలో కడిగిపారేసిన కాంగ్రెస్ ఇప్పుడు అంత ధైర్యం చేయలేకపోతోంది. ఈ సీడీ వ్యవహారంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ పేరు కూడా తాజాగా తెరపైకి రావడమే దీనికి కారణం. కర్ణాటకలో ఈ రాసలీలల సీడీ కాంగ్రెస్, బీజేపీ మెడకు చుట్టుకుంది. ఈ రాసలీలల సీడీ వ్యవహారం ఎలాంటి ముగింపు తీసుకుంటుందోనన్న టెన్షన్ రెండు పార్టీల్లో కనిపిస్తోంది. ఈ సీడీలో యువతితో పాటు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కున్న బీజేపీ నేత రమేష్ జార్కిహోళి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సీడీ కేసు ఇప్పుడు జార్కిహోళి వర్సెస్ డీకే శివకుమార్ ఎపిసోడ్ కు తెరలేపింది.
ఒకపక్క ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఈ రాసలీలల వీడియోలో కనిపించిన యువతి ఇప్పటికే ఐదు వీడియోలు విడుదల చేసింది. జార్కిహోళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వేధించాడని ఆ యువతి ఆరోపిస్తోంది. అంతేకాదు, తనకు భద్రత కల్పించాలని కూడా కోరింది. అయితే, యువతి తల్లిదండ్రులు చెబుతున్న వాదన మాత్రం మరోలా ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ తమ అమాయక కూతురిని అడ్డం పెట్టుకుని జార్కిహోళి పై హనీట్రాప్ వలపన్నాడని, జార్కిహోళితో ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా ఆయనను ఇరకాటంలోకి నెట్టడానికి డీకే ప్రయత్నించాడని యువతి తల్లిదండ్రులు చెప్పడం కొసమెరుపు.
రమేశ్ జార్కిహొళిపై పలు ఆరోపణలను చేస్తూ తాజాగా యువతి కర్ణాటక హైకోర్టు సీజేకు రాసిన లేఖను ఆయన సోమవారం విడుదల చేశారు. ఆ లేఖలో ఏముందంటే ..రమేశ్ జార్కిహొళి ప్రమాదకర వ్యక్తి. సామాన్యులను బెదిరించడమే ఆయన పని. నాకు, నా కుటుంబానికి రక్షణ అవసరం. సిట్‌తో దర్యాప్తు చేయించాలి. జార్కిహొళిపై అత్యాచారం, బెదిరింపులు, మోసం సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ అరెస్టు చేయలేదు. నాకు అన్యాయమే జరిగింది. మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. జార్కిహొళి ఏ సమయంలో అయినా నన్ను చంపేస్తాడు అని లేఖలో యువతి ఆరోపించింది. సిట్ అధికారులపై నాకు నమ్మకం లేదు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. జార్కిహోళి ఓ క్రిమినల్. ఆలస్యమైతే సాక్ష్యాలను తారుమారు చేస్తారని భయంగా ఉంది. నాకు బహిరంగ వార్నింగ్‌లు ఇచ్చారు. అందుకే విచారణకు హాజరయ్యేందుకు భయపడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జార్కిహొళికి అనుకూలంగా ఉంది. సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు నన్ను హత్య చేయించే అవకాశం లేకపోలేదు అని ఆరోపణలు చేసింది.
రమేశ్ జార్కిహొళి సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారు 4 గంటల పాటు విచారణ చేశారు. సీడీలో ఉన్నట్లు భావిస్తున్న యువతికి సిట్ పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు పంపించారు. మంగళవారం బెంగళూరులో కబ్బన్‌పార్కు పోలీసుల ఎదుటహాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆ యువతికి పోలీసులు ఇప్పటివరకు ఆమెకు 8 సార్లు నోటీసులు పంపించినా ఆమె ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు.