రాసలీల కేసుః బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్న యువ‌తి?

Update: 2021-03-29 04:09 GMT
క‌ర్నాట‌క జ‌ల‌వ‌న‌రుల మాజీ మంత్రి ర‌మేష్ జార్కి సెక్స్ వీడియోల వ్య‌వ‌హారం.. ట్విస్టుల మీద ట్విస్టుల‌తో కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. మార్చి రెండు నుంచి అండ‌ర్ గ్రౌండ్ లో ఉన్న య‌వ‌తి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు వీడియోలు రిలీజ్ చేసింది. ప‌లు ఆడియో టేపులు కూడా వ‌దలింది.

తాజాగా.. రిలీజ్ చేసిన వీడియాలో మాజీ మంత్రి ర‌మేష్ జార్కిపై కేసు న‌మోదు చేయాల‌ని కోరిందట‌. తాను అజ్ఞాతంలో ఉన్నాన‌ని, అందువ‌ల్ల త‌న న్యాయ‌వాది ద్వారా పోలీసు క‌మిష‌న‌ర్ కు ఫిర్యాదు లేఖ‌ను పంపుతున్నాన‌ని, దాని ఆధారంగా కేసు న‌మోదు చేయాలని కోరిందని స‌మాచారం. ఆ వీడియోను, ఫిర్యాదు కాపీని తీసుకొని లాయ‌ర్ జ‌గ‌దీష్ కుమార్ బెంగ‌ళూరు న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ క‌మ‌ల్ పంత్ ను క‌లిశారని తెలిసింది.

ఆఖ‌రి రెండు వీడియోల్లో యువ‌తి మాట్లాడుతూ.. తాను అండ‌ర్ గ్రౌండ్ లో ఉన్నాన‌ని.. త‌న‌కు, త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించిన త‌ర్వాతే బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని, సిట్ అధికారుల ముందు కూడా హాజ‌ర‌వుతాన‌ని ఆ వీడియోలో చెప్పిన‌ట్టు స‌మాచారం. రోజుల‌త‌ర‌బ‌డి సాగుతున్న ఈ టార్చ‌ర్ తాను త‌ట్టుకోలేక‌పోతున్నాన‌ని, త‌న‌పై వేధింపులు ఆప‌క‌పోతే మాజీ మంత్రి ర‌మేష్ జార్కి పేరు రాసి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని చెప్పిందట‌. ఈ వీడియో ఆధారంగా పోలీసులు ర‌మేష్ జార్కి పై ఎఫ్ఐఆర్‌ న‌మోదుచేసిన‌ట్టు తెలిసింది.

అయితే.. అందుతున్న లేటెస్ట్ అప్డేట్‌ ప్ర‌కారం స‌ద‌రు యువ‌తి అజ్ఞాతం వీడ‌నున్న‌ట్టు తెలుస్తోంది. యువ‌తి త‌ర‌పు న్యాయ‌వాది జ‌గ‌దీష్ మాట్లాడుతూ సోమ‌వారం ఆమె కోర్టులో లొంగిపోవ‌చ్చ‌ని చెప్పార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు.. యువ‌తి త‌ల్లిదండ్రుల‌కు పోలీసులు భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో అనే ఉత్కంఠ నెల‌కొంది.
Tags:    

Similar News