మాజీ మంత్రికి చుక్కలు చూపిస్తున్న సీబీఐ

Update: 2020-11-23 12:10 GMT
వేల కోట్ల రూపాయల ఐఎంఏ స్కామ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్ కు సీబీఐ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మాజీ మంత్రి రోషన్ బేగ్ కు మసాలా దోసె తినిపించి అరెస్ట్ చేసి జైలుకు  పంపిన సీబీఐ సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది.

ఐఎంఏ స్కామ్ లో వ్యవస్థాపకుడు మన్సూర్ అలీఖాన్... తాను మాజీమంత్రి రోషన్ బేగ్ కు రూ.400 కోట్లు ఇచ్చానని.. డబ్బులు తిరిగి ఇవ్వకుంటే రౌడీలను పంపించి చంపేస్తానని బెదిరించాడని రోషన్ బేగ్ మీద ఆరోపణలు చేశాడు. ఇదే కేసులో గత ఏడాది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోషన్ బేగ్ కు సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. బెంగళూరులో రోషన్ బేగ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఆయనను ఆగ్రహార జైలుకు పంపించారు.

ఐఎంఏ వ్యవస్థాపకుడు మన్సూర్ బెంగళూరుతోపాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజలకు కుచ్చుటోపి పెట్టి 2019లో దుబాయ్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేయగా.. పోలీసులు భద్రత కల్పిస్తే భారత్ వచ్చి లొంగిపోతానని మన్సూర్ అలీఖాన్ తెలిపాడు.

ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే రోషన్ బేగ్ కు తాను రూ.400 కోట్లు ఇచ్చానని.. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే ఆయన రౌడీలను పంపించి చంపేస్తానని బెదిరించాడని మన్సూర్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఈ మేరకు సీబీఐ తాజాగా రోషన్ ను విచారిస్తోంది.
Tags:    

Similar News