జగన్ వ్యక్తిగత హాజరుకు కోర్టు ఓకే

Update: 2020-01-17 08:37 GMT
అక్రమాస్తుల కేసుల విచారణకు హాజరయ్యే విషయంలో మినహాయింపు కోరిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మినహాయింపు లభించింది. హైదరాబాద్ లోని సీబీఐ.. ఈడీ కోర్టులో జరుగుతున్న అక్రమాస్తుల కేసు విచారణ ఈ రోజు (శుక్రవారం) జరుగుతోంది. ఈ కేసులో కోర్టుకు హాజరు కావాలని గత శుక్రవారం ఏడుగురు నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది.

సమన్లు జారీ చేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు. దీనికి సంబంధించిన అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు నుంచి మినహాయింపు లభించింది. కేసు విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయాన్ని వెల్లడించింది.

మరోవైపు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో హైపర్ కమిటీతో భేటీ జరుగుతోంది. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీ రాజధానికి సంబందించి జీఎన్ రావు. బీసీజీ నివేదికల్ని పరిశీలించిన హైపర్ కమిటీ సభ్యులు.. ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అంతేకాదు.. రాజధాని రైతుల సమస్యల గురించి కూడా వారు చర్చించనున్నారు.


Tags:    

Similar News