సంచలనం: మాజీ సీఎంపై కేసు నమోదు
మాజీ సీఎంకు పోలీసులు షాకిచ్చారు. ఏకంగా పోలీస్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం కరోనా వేళ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ తో సహా 8మంది కాంగ్రెస్ నాయకులు కరోనా నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ సభ నిర్వహించారని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అర్వింద్ మహార్ రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు మాజీ సీఎం కమల్ నాథ్ తో సహా 8మంది కాంగ్రెస్ నాయకులపై ఐపీసీ పలు సెక్షన్లతోపాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ల కింద కేసు నమోదు చేశారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నహర్ సింగ్ యాదవ్ భాందర్ లోని మండిలో 100మంది ప్రజలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేవం నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు.
అయితే ఈ సభకు రెండు వేల మంది నుంచి 2500 వరకు హాజరు కావడం విశేషం. దీంతో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ సభ కారణమైందని ఆరోపిస్తూ పోలీసులు కేసునమోదు చేశారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 28 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నవంబర్ 3న పోలింగ్, 10వ తేదిన కౌంటింగ్ జరుగనుంది.