ఆ ఎంపీ పై లైంగిక వేధింపుల కేసు .. ఎంపీ ఏంచెప్పారంటే ?
ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులపై లైంగిక ఆరోపణల కేసులు నమోదు కావడం సర్వసాధారణమైపోయింది. ఆ కేసుల్లో కొన్ని ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయి. ఇక తాజాగా మరో ఎంపీ పై లైంగిక ఆరోపణల కేసు నమోదు నమోదు అయింది. అయితే సదురు ఎంపీ మాత్రం తన పై తప్పుడు కేసు పెట్టారని , ఎలాంటి విచారణకి అయినా సిద్ధం అని చెప్తున్నారు. అసలు ఈ వ్యవహారం పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ... !
పాల్ఘర్ ఎంపీ రాజేంద్ర గేవిట్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఎంపీకి చెందిన గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న ఓ మహిళ శుక్రవారం నవ్య నగర్ పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. ఆర్థిక సహాయం చేస్తానంటూ ఎంపీ గేవిట్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది. గత నవంబర్ లో తోటి సిబ్బంది ముందే తనను వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు చేసింది.
అలాగే , ఆ ఫిర్యాదులో ... నేను ఎంపీ గేవిట్, ఆయన భార్యకు చెందిన గ్యాస్ ఏజెన్సీలో 2004నుంచి పనిచేస్తున్నాను. అంతంత మాత్రంగా ఉన్న నా ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని జీతం పెంచుతానంటున్నాడు. తనకు సహకరిస్తే దానికి ప్రతిఫలంగా ఏం అడిగినా చేస్తానన్నాడు. ఓ ఫ్లాట్, నా కుమారుడి చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తానన్నాడు. నేను కుదరదని చెబుతూ వచ్చాను. ఆ తర్వాత చాలా రకాలుగా నన్ను వేధింపులకు గురిచేశాడు అని పేర్కొంది.
ఆ మహిళ ఫిర్యాదు పై ఎంపీ గేవిట్ స్పందిస్తూ .. తన పై మహిళ చేస్తున్న లైంగిక ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ మహిళతో పాటు మరి కొంతమంది 1.24 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారు. దీంతో నేను నవంబర్ 26వ తేదీ అదే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాను. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. దీంతో ఆమె నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తోంది. నేను ఏ విచారణనైనా ఎదుర్కోవటానికి సిద్ధం అని చెప్పారు.