2026లో యూరప్ జీతాల రేస్… టాప్ ఎవరు? బాటమ్ ఎవరు?
యూరప్ అనగానే మనందరికీ ఒకే రకమైన సంపన్న దేశాలు గుర్తుకు వస్తాయి, కానీ అక్కడి జీతాల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.;
యూరప్ అనగానే మనందరికీ ఒకే రకమైన సంపన్న దేశాలు గుర్తుకు వస్తాయి, కానీ అక్కడి జీతాల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. 2026 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, లక్సెంబర్గ్ వంటి దేశాల్లో నెలకు సుమారు యురొ2,704 (లక్షల్లో) వేతనం అందుతుంటే, ఉక్రెయిన్ వంటి దేశాల్లో అది కేవలం యురొ 173 మాత్రమే. ఒకే ఖండం, ఒకే రీజియన్.. కానీ ఆర్థికంగా దేశాల మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఈ భారీ వ్యత్యాసాలు ఆయా దేశాల జీవన ప్రమాణాలను ప్రతిబింబిస్తున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..
యూరప్ మొత్తం మీద అత్యధిక కనీస వేతనం ఇస్తున్న దేశంగా లక్సెంబర్గ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ నెలకు దాదాపు యురొ 2,704 గ్రాస్ జీతం లభిస్తోంది. దీని తర్వాత ఐర్లాండ్ 2,391, జర్మనీ 2,343, నెదర్లాండ్స్ 2,295 మరియు బెల్జియం 2,112 (యురొ) దేశాలు టాప్-5లో ఉన్నాయి. ఈ దేశాల్లో పని చేసే వారికి లభించే సౌకర్యాలు, వేతనాలు చూస్తుంటే మిగతా ప్రపంచానికి ఇవి ఎంతో దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆర్థికంగా బలంగా ఉన్న ఈ దేశాలు తమ కార్మికులకు అత్యుత్తమ వేతన ప్యాకేజీలను అందిస్తున్నాయి.
మధ్యస్థంగా ఉన్న దేశాల పరిస్థితి:
ఫ్రాన్స్ 1,823, స్పెయిన్ 1,381, స్లోవేనియా 1,278 వంటి దేశాలు మధ్యస్థ వేతనాలతో నెట్టుకొస్తున్నాయి. పోలాండ్, లిథువేనియా, పోర్చుగల్ వంటి దేశాల్లో జీతాలు వెయ్యి యూరోల మార్కు వద్ద ఊగిసలాడుతున్నాయి. గ్రీస్ 1,027, క్రొయేషియా 1,050 యురొ దేశాలు కూడా ఇదే వరుసలో ఉన్నాయి. ఇక ఈ దేశాల్లో జీవన వ్యయం కొంత తక్కువగా ఉన్నప్పటికీ, టాప్ దేశాలతో పోలిస్తే ఇక్కడి ప్రజల కొనుగోలు శక్తిలో చాలా తేడా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న ఈ దేశాలు వేతనాల పెంపుపై దృష్టి పెడుతున్నాయి.
అట్టడుగున ఉన్న దేశాలు.. షాకింగ్ నంబర్స్:
వేతనాల రేసులో చిట్టచివరన ఉన్న దేశాల గణాంకాలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. అల్బేనియా యురొ 517, మోల్డోవా యురొ 319 దేశాల్లో జీతాలు చాలా తక్కువగా ఉండగా, ఉక్రెయిన్ కేవలం 173తో అందరికంటే అట్టడుగున ఉంది. అత్యధిక వేతనం ఇచ్చే లక్సెంబర్గ్‌తో పోలిస్తే, ఉక్రెయిన్ జీతం 15 రెట్లు తక్కువ కావడం గమనార్హం. ఇక యుద్ధ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు ఈ దేశాల వేతనాలపై తీవ్ర ప్రభావం చూపాయి. టర్కీ యురొ 654, బల్గేరియా 620 యురొ వంటి దేశాలు కూడా తక్కువ వేతనాల జాబితాలోనే ఉన్నాయి.
ఆర్థిక వ్యత్యాసాలు - ఒకే ఖండం.. వేర్వేరు లోకాలు:
యూరప్ అంతా ఒకే గొడుగు కింద ఉన్నట్లు అనిపించినా, ఆర్థికంగా మాత్రం దేశాల మధ్య 'వరల్డ్స్ అపార్ట్' అన్నట్టుగా ఉంది. పశ్చిమ యూరప్ దేశాలు సంపదతో తులతూగుతుంటే, తూర్పు యూరప్ దేశాలు ఇంకా అభివృద్ధి పథంలో వెనుకబడి ఉన్నాయి. ఇక ఈ వేతన వ్యత్యాసాల వల్లే చాలా మంది తక్కువ వేతనం ఉన్న దేశాల నుండి ఎక్కువ జీతాలు ఇచ్చే దేశాలకు వలస వెళ్తున్నారు. 2026 నాటికి ఈ అంతరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.ఇక ఇది కేవలం జీతాల తేడా మాత్రమే కాదు, ఆయా దేశాల ఆర్థిక భవిష్యత్తుకు అద్దం పడుతోంది.