కూన రవికుమార్ పై కేసు నమోదు ...రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్!

Update: 2020-05-25 06:45 GMT
తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్  పై పోలీసులు కేసు నమోదు చేసి , అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లా  పొందూరు తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారంటూ రవికుమార్‌పై   353 - 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం అరెస్ట్‌ చేసేందుకు రవికుమార్‌ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయితే, అయన అర్ధరాత్రే  అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం బదిలీ పై వెళ్లిన శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్‌ రామకృష్ణను టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ బెదిరించారు. ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్‌ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్‌ ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్‌ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్‌ చేశారు. దీంతో రవికుమార్‌ తహసీల్దార్‌ కు ఫోన్‌చేసి బెదిరించారు. ఆ ఆడియో ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది.

దీనిపై  తహసీల్ధార్‌ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రభుత్వ అధికారులంటే చులకన అని,ప్రభుత్వ అధికారులను దూషించడం ఆయనకు అలవాటు అని, గతంలో కూడా ఆయన చాలాసార్లు నన్ను దుర్భాషలాడారని, పాతేస్తానని రవికుమార్‌ తనను బెదిరించారని తెలిపారు. ఆయన అనుచరులు తన కారును వెంబడించి బెదిరింపులకు దిగారని రామకృష్ణ తెలిపారు. ఈ ఘటన పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశాయి.
Tags:    

Similar News