ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు.. ఇంజన్ తెరిచి షాక్ అయిన పోలీసులు !

Update: 2021-04-10 09:47 GMT
హైదరాబాద్ ‌లో రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. హైదరాబాద్ నగర శివారున పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద షిప్ట్ కారు లో మంటలు అంటుకున్నాయి. దీనితో ఒక్కసారిగా భయపడి అందులో ఉన్న బయటకు దిగేశారు. అయితే వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేయకుండా , క్షణాల్లో అక్కడి నుండి పారిపోయారు. దీనితో ఆ వైపుగా  వెళ్తున్న వాహనదారులు, స్థానికులు కారులో వ్యాపించిన మంటలు ఆర్పివేశారు.

 కారు ఇంజన్ నుంచి మంటలు చెలరేగడంతో ఇంజన్ తెరిచి చూస్తే గంజాయి ముఠా గుట్టు చప్పుడు కాకుండా కారు ఇంజన్ లో గంజాయి పేట్టి తరలించే ప్రయత్నం చేశారు.  కానీ ఇంజనులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తమ గుట్టు రట్టు అవుతుందన్న భయంతో కారును నడి రోడ్డుపై అక్కడే వదిలి పారిపోయారు. గంజాయి ముఠా గుట్టు చప్పుడు కాకుండా కారు ఇంజన్ లో గంజాయి పెట్టి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఇంజనులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తమ గుట్టు రట్టు అవుతుందన్న భయంతో కారును నడి రోడ్డుపై అక్కడే వదిలి పారి పోయారు.  విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ వ్యక్తులు ఎవరు విజయవాడ నుండి హైదరాబాద్‌ కు గంజాయిని తీసుకొచ్చి ఎక్కడ విక్రయించబోతున్నారు, లేక ఎవరికైనా ఇవ్వడానికి వచ్చారా ,అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.

  విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ వ్యక్తులు ఎవరు విజయవాడ నుండి హైదరా బాద్‌కు గంజాయిని తీసుకొచ్చి ఎక్కడ విక్రయించబోతున్నారు? లేక ఎవరికైనా ఇవ్వడానికి వచ్చారా ?అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Tags:    

Similar News