తెల్లవారుజామున పసరకొండ వద్ద దారుణ ప్రమాదం..ఐదుగురు దుర్మరణం

Update: 2020-09-02 04:30 GMT
ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ గ్రామీన జిల్లాలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం షాకింగ్ గా మారింది. దామెర మండలంలోని పసరకొండ రోడ్డు మీద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఐదు నిండు ప్రాణాలు అక్కడికక్కడే పోయేలా చేసింది. అతి వేగం.. ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే తొందరలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.

ప్రాథమికంగా లభించిన సమాచారం ప్రకారం.. వరంగల్ జిల్లాలోని పోచం మైదాన్ కు చెందిన ఐదుగురు.. కారులో ప్రయాణిస్తున్నారు. ముందుగా వెళుతున్న  కారును ఓవర్ టేక్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో అనుకోని రీతిలో లారీని ఢీ కొట్టారు. ప్రమాదం జరిగిన సమయానికి.. కారు అతి వేగంగా ఉండటం.. లారీని బలంగా ఢీకొనటంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు.

కారు మొత్తంగా నుజ్జు నుజ్జుగా అయ్యింది. మరణించిన ఐదుగురు కారులో ఇరుక్కున్నారు. స్థానికుల సాయంతో వారిని అతి కష్టమ్మీద బయటకు తీశారు. అప్పటికే కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించినట్లుగా గుర్తించారు. ఈ దారుణ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. 
Tags:    

Similar News