• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  ఆ విషయంలో అమెరికాలో ...

ఆ విషయంలో అమెరికాలో భారతీయులే టాప్... ట్రంప్ కు అర్ధమవుతుందా..!

| అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్రపై ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

By - Raja Ch
Update: 2026-01-10 13:30 GMT

అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్రపై ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్స్ అంటూనే.. భారతీయులపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతూ, వీసాల విషయలోనూ, గ్రీన్ కార్డ్స్ జారీలోనూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే చర్చా జరుగుతున్న సంగతీ తెలిసిందే. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. అమెరికాలో ఉన్న విదేశాల్లో జన్మించిన బిలియనీర్ల సంఖ్యలో అగ్రగామిగా ఉన్న దేశంగా ఇజ్రాయెల్‌ ను అధిగమించి భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.

అవును... అమెరికాలో నివసిస్తున్న విదేశీ బిలియనీర్లకు భారతదేశం నాయకత్వం వహిస్తుందని.. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ ను అధిగమించిందని ఫోర్బ్స్ 2025 జాబితా వెల్లడించింది. ఈ ఆసక్తికర విషయం ప్రపంచ ప్రభావంలో పెరుగుతున్న భారతీయ ప్రవాసుల కీలక పాత్రను ప్రతిబింబిస్తుందని అంటున్నారు. ప్రధానంగా... సాంకేతికత, ఆర్థిక రంగాలలో భారతీయుల పాత్ర అగ్రారాజ్యంలో మరింత కీలకంగా మారుతూ రోజు రోజుకీ పెరుగుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో భారత్ తర్వాత స్థానంలో ఇజ్రాయెల్, తైవాన్ లు నిలవగా.. కెనడా, చైనా తర్వాత స్థానాల్లో నిలిచాయి.

ఫోర్బ్స్ 2025 తాజా నివేదిక ప్రకారం... అమెరికాలో భారతీయ సంతతికి చెందిన బిలియనీర్ల సంఖ్య 2022లో ఐదుగురుగా ఉండగా.. 2025లో ఆ సంఖ్య 12కి పెరిగింది. ఈ పెరుగుదల అమెరికాలో విదేశీ బిలియనీర్ల సంఖ్యలో టాప్ లో ఉన్న ఇజ్రాయెల్‌ ను భర్తీ చేస్తూ భారతదేశం అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ బిలియనీర్ల సంఖ్యలో ఎక్కువమందికి టెక్నాలజీ రంగం వారి సంపదకు ప్రాథమిక వనరుగా ఉంటే.. ఆ తర్వాత స్థానంలో ఆర్థిక రంగంలోని వ్యక్తులు ఉన్నారు. వీరిలో 93% మందికి వారి సంపద స్వయంగా సృష్టించబడిందని ఫోర్బ్స్ నివేదిక జోడించింది.

ఈ జాబితాలో భారత్ నుంచి సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘జెడ్ స్కేలర్’ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ‘సన్ మైక్రోసిస్టమ్స్’ వినోద్ ఖోస్లా.. ‘యూఎస్ సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్’ రాకేష్ గంగ్వాల్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉన్నారు. ఈ నేపథ్యంలోనే... ఈ విషయంలో భారతదేశం తన సంఖ్యను పెంచుకోవడమే కాకుండా.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో తన వ్యూహాత్మక స్థానాన్ని కూడా పెంచుకుందని అంటున్నారు పరిశీలకులు!

ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్‌ లో టాప్ 10 ధనవంతులైన భారత సంతతికి చెందిన బిలియనీర్లు (2025) జాబితా ఈ విధంగా ఉంది...:

1) జే చౌదరి - 17.9 బిలియన్ డాలర్లు

2) వినోద్ ఖోస్లా - 9.2 బిలియన్ డాలర్లు

3) రాకేష్ గంగ్వాల్ - 6.6 బిలియన్ డాలర్లు

4) రొమేష్ టి. వాధ్వానీ - 5.0 బిలియన్ డాలర్లు

5) రాజీవ్ జైన్ - 4.8 బిలియన్ డాలర్లు

6) కవిటార్క్ రామ్ - 3.0 బిలియన్ డాలర్లు

7) రాజ్ సర్దానా - 2.0 బిలియన్ డాలర్లు

8) డేవిడ్ పాల్ - 1.5 బిలియన్ డాలర్లు

9) నికేష్ అరోరా - 1.4 బిలియన్ డాలర్లు

10) సుందర్ పిచాయ్ - 1.1 బిలియన్ డాలర్లు

Tags:    
  • forbes2025 
  • indianbillionaires 
  • usindians 
  • globalwealth 
  • india 
  • usa 
  • donaldtrump 
  • nri 
  • usbillionaires 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

ఫుడ్ బ్యాంక్ వివాదం.. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ద్వేషానికి మరో అస్త్రం

2026-10-25 08:30 GMT

F-1 వీసా రిజెక్ట్ అయితే 300 రోజులు ఆగాలా?

2026-10-25 04:52 GMT

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో ఫోన్ మాట్లాడిన కాసేపటికే విషాదం!

2026-10-23 14:17 GMT

ట్రంప్ అండతో రామస్వామి దూకుడు.. ఓహియో ఎన్నికల్లో వ్యక్తిగత దాడులే కీలకమవుతున్నాయా?

2026-10-23 05:17 GMT

అమెరికా నుంచి భారత్‌కు ఐటీ ఉద్యోగుల రివర్స్ జర్నీ.. 9 నెలల్లో 12,700 మంది వెనక్కి!

2026-10-22 04:23 GMT

Copyright @2026

Powered by Blink CMS