నో బీర్ - నో బిరియానీ .. ఓన్లీ మాస్క్ - శానిటైజేర్.. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల సరికొత్త ప్లాన్
సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే ఆక్కడ ఉండే హడావిడే వేరు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు నానా హడావిడి చేస్తుంటాయి. ఓటుకి ఇంత అని కట్టబెట్టడమే కాకుండా ఎన్నికల క్యాంపెన్ లో తిరిగినందుకు బీరు.. బిరియానీ.. ఖరీదైన బహుమతులని ఇస్తూ ప్రచారం చేస్తుంటాయి. అతి త్వరలోనే జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి గ్రేటర్ ఎన్నికలని అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ అప్పుడే ప్రచారాన్ని కూడా షురూ చేసేశాయి. కానీ ప్రస్తుతం కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో నేతలు సరికొత్త ప్లాన్ తో ముందుకువచ్చారు.
బీరు, బిరియానీల స్థానంలో మాస్క్, శానిటైజర్లను ఉచితంగా అందజేస్తూ ఓటర్ల ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ వలంటీర్లను ఓటర్ల ఇళ్లకు పంపించి తమకు చేతనైనంతలో బహుమతులు ఇవ్వడం తమకు అలవాటని టికెట్ ఆశిస్తున్న ఓ అభ్యర్థి చెప్పారు. ఈసారి ఆ వలంటీర్లతోనే పారాసిటమాల్ ట్యాబ్ లెట్లు - మాస్క్ లు - శానిటైజర్లు - విటమిన్ గోళీలను ఇంటింటికీ పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు విడతల పంపిణీ ముగిసిందని, ఎన్నికలు పూర్తయ్యేలోపు మరోసారి పంపిస్తామని వివరించారు.ఆయా ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారీ అభ్యర్థులు. మాస్కులు - శాటిటైజర్లు - మందులతోపాటు వలంటీర్లకు కూడా రాజకీయ పార్టీలు భారీగా ఖర్చుపెడుతున్నాయి. ఒక్కో వలంటీర్ కు 6 గంటలు పనిచేస్తే 600.. 12 గంటలు పనిచేస్తే 1200 ఇస్తున్నారట.