ప‌ప్పు..ఉప్పు అన్నా నాకేం బాధ‌లేదుఃలోకేష్‌

Update: 2017-08-02 17:35 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ త‌న‌పై సెటైరిక‌ల్‌ గా వ‌చ్చే ``ప‌ప్పు`` అనే కామెంట్‌ కు అనూహ్య‌మైన రీతిలో స్పందించారు. ఓ ప్ర‌ముఖ టీవీ చానెల్‌ తో మాట్లాడిన నారా లోకేష్‌ ను స‌ద‌రు పాత్రికేయుడు ఈ ఇబ్బందిక‌ర‌మైన అంశాన్ని సూటిగా ప్ర‌శ్నించగా లోకేష్ కూల్‌ గా రియాక్ట‌య్యారు. ``సోష‌ల్ మీడియాలో లోకేష్‌ ప‌ప్పు అని సెటైర్లు పేలుతున్నాయి, ఆఖ‌రికి గూగుల్‌ లో సైతం ఏపీ ప‌ప్పు అని సెర్చ్ చేస్తే మీ బొమ్మ వ‌స్తోంది...దీనికి ఎలా స్పందిస్తారు అని ప్ర‌స్తావించ‌గా చాలా క్యాజువ‌ల్‌ గా రియాక్ట‌య్యారు.

త‌ను ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయ‌డాన్ని అలాంటివ‌న్నీ ఆప‌లేవ‌ని లోకేష్ పేర్కొన్నారు. ``సోష‌ల్ మీడియా కేంద్రంగా వ్యాపారం చేసుకునే కొంద‌రు ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. కానీ వాళ్లు ఏం చేస్తారు? మ‌హా అంటే నాపై రెండు వార్త‌లు రాస్తారు లేదా రెండు నిమిషాల పాటు వీడియోలు ప్ర‌సారం చేస్తారు అంతే కదా?  అలా న‌న్ను ప‌ప్పు అనో ...ఉప్పు అనో చేసే ప్ర‌చారం గురించి నాకేమీ ఇబ్బంది లేదు. ప్ర‌జ‌లు డిసైడ్ చేస్తారు నేనేంటో.ప్ర‌జ‌ల‌కే నేను జ‌వాబుదారిని`` అని లోకేష్ స్ప‌ష్టం చేశారు.

``ఒక‌వేళ ప‌ప్పు అయితేనే జ‌న‌వాణి, 40 ల‌క్ష‌ల ఎల్ఈడీ బ‌ల్బుల పంపిణీ, గ్రామాల్లో భూగ‌ర్భ డ్రైనేజీ విధానం వంటివి ప్రారంభించేవాడినేనా?  నేను ఇలా కార్టూన్లు వేసేవారికి, కామెంట్లు చేసేవారికి జ‌వాబు దారి కాదు. ఇలా సోష‌ల్ మీడియా కేంద్రంగా బుర‌ద జ‌ల్ల‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న వారి వ‌ల్ల ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌నే నా త‌పన‌ను నీరుగార్చ‌లేరు`` అని నారా లోకేష్ స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News