2100 నాటికి చైనా, ఇండియాలో భారీగా తగ్గనున్న జనాభా.. కారణాలివీ
దేశంలో జనాభా తగ్గుతోంది. ఒక మహిళా సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం దేశంలో 1.76గా ఉంది. అంటే ఒక మహిళ ఇద్దరినీ కూడా కనడం లేదు. చాలా మంది ఒకరితోనే ఎండ్ చేస్తున్నారు. ఇదే 2032 నాటికి 1.39కి, 2052కి 1.28, 2082 నాటికి 1.2కి, 20100 నాటికి కేవలం 1.19గా ఉంటుందట.. జనాభా ఇలానే తగ్గితే రాబోయే 100 ఏళ్లలో ఏకంగా 41 కోట్ల జనాభా తగ్గిపోతుందని లెక్కలు తేల్చాయి.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం చైనా. రెండో అత్యధిక జనాభా భారత్ సొంతం. అయితే త్వరలోనే చైనాను దాటేసి మొదటిస్థానంలోకి భారత్ చేరే అవకాశాలున్నాయి. అయితే విదేశాల్లో జనాభా మరీ తగ్గుతోంది. విపరీతంగా పెరిగిపోతున్న భారత దేశజనాభా మరికొన్నేళ్లలో తగ్గిపోతుందట.. దాదాపు 41 కోట్ల జనాభా తగ్గవచ్చని ఒక నివేదిక వెల్లడించింది.
రాబోయే 78 ఏళ్లలో అంటే 2100 వరకూ దాదాపు 41 కోట్ల మేర జనాభా తగ్గుతుందని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ఒక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. జనాభా విపరీతంగా పెరిగిపోయినప్పుడు వనరులు భారీగా తగ్గిపోతాయి. దీనివల్ల జీవన ప్రమాణాలు తగ్గుతాయి. అంతిమంగా జనాభా తగ్గుదల మొదలవుతుంది.
జనాభాలో మనం చైనా తర్వాత ఉన్నప్పటికీ.. జనసాంద్రతలో మాత్రం మనమే ముందున్నాం. ప్రస్తుతం మన దేశంలో ఒక చదరపు కిలోమీటరుకు సగటున 476మంది జీవిస్తుంటే.. చైనాలో 148 మంది మాత్రమే బతుకుతున్నారు.
2100 సంవత్సరంలో మన దేశంలో చదరపు కిలోమీటరుకు 335 మంది జీవిస్తే .. చైనాలో కేవలం 51మంది మాత్రమే జీవిస్తారని సర్వేలో తేలింది. చదరపు కిలోమీటరుకు అమెరికాలో 37మంది జీవిస్తే.. 2100 కల్లా 31 మంది, జపాన్ లో ప్రస్తుతం 329మంది జీవిస్తే.. 2100 నాటికి 133మంది మాత్రమే జీవిస్తారు. అంటే మన దేశంతోపాటు అన్ని దేశాల్లోనూ జనాభా, జనసాంద్రత విపరీతంగా తగ్గుతుంది.
మన దేశ జనాభా 2050 వరకూ బాగా పెరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుదల మొదలవుతుంది. 2075, 2100కల్లా భారీస్థాయిలో తగ్గుతుంది. ఇప్పటికీ అధికారికంగా జనాభా లెక్కలు మొదలుకానప్పటికీ ప్రస్తుతం మన దేశ జనాభా 141 కోట్లు ఉన్నట్లు అంచనా. సంతానోత్పత్తి రేటు తగ్గడం కూడా జనాభా తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది.