మంచిర్యాలలో ఇంటింటికి వచ్చి పాత మొబైళ్లను కొంటున్నారు
తినేందుకు తిండి ఉందా? లేదా? అన్నది తర్వాతి విషయం.. చేతిలో మొబైల్ అయితే మాత్రం కచ్ఛితంగా ఉంటున్న పరిస్థితి. ఇంటికి టాయిలెట్ లేని లక్షలాది మంది చేతుల్లో మాత్రం మొబైళ్లు ఉండటం చూస్తే.. సెల్ ఫోన్ కు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో ఇట్టే అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో తోపుడు బండ్ల మీద వస్తువుల్ని తీసుకొచ్చి.. పాత సామాన్లు కొంటామని అరిచే చిరు వ్యాపారులు తాజాగా పాత మొబైళ్లు కొంటామని చెబుతున్నారు.
ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో.. పాత మొబైళ్లను తీసుకొని.. ఒక్కో దానికి రెండేసి గాజు గ్లాసుల్ని ఇస్తున్నారు. ఇంతకీ ఈ పని చేయని పాత మొబైళ్లను తీసుకొని ఏం చేస్తారని అడిగితే.. మంచిర్యాలలోని ఒక చిరు వ్యాపారి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. కరోనా కారణంగా మొబైల్ ఫోన్ల తయారీపై తీవ్ర ప్రభావం పడిందని.. ఫోన్ల లోపల ఉండే ఐసీల దిగుమతి ఆగిపోయిందని.. దీంతో వాటి కొరత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
దీంతో..బిహార్ కు చెందిన ఒక మొబైల్ కంపెనీ.. పాత ఫోన్లను పెద్ద ఎత్తున కొంటున్నారని.. అందులోని పాత ఐసీలను కొత్త ఫోన్లకు వాడుతున్నారని.. దీంతో వీటికి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే తాము ఇంటింటికి తిరిగి పాత మొబైళ్లను సేకరించి.. బిహార్ లోని సంస్థకు అమ్మేయనున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరంగా ఉంది కదూ?