ఉన్న మాట అంటే ఉలుకెందుకు బుద్ధా?

Update: 2019-12-16 11:45 GMT
తెలుగు తమ్ముడికి కోపం వచ్చింది. నిజమే.. ఉన్న మాట అంటే ఉలుకెక్కువన్న సామెతకు తగ్గట్లే తాజాగా టీడీపీ నేత బుద్దా వారి మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంత:పుర రహస్యాల్ని ఆయన సన్నిహితుడు రవితేజ్ బయటపెట్టిన వైనంతో రేగుతున్న కలకలం గురించి తెలిసిందే.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తికర రీతిలో ట్వీట్ చేశారు. జనసేన మాజీ నేత రాజా రవితేజ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్వీట్ చేస్తూ.. దత్త పుత్రుడు పవనిజం గ్రంధాన్ని రాశాడంటే ఎవరూ నమ్మలేదన్నారు. గోస్టు రైటర్ రాస్తే పేరు పెట్టుకోవటం సినిమావాళ్లకు తెలిసిన విద్యేనని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.  

స్పీచులు.. సోషల్ మీడియా కామెంట్లన్నీ బ్యాక్ గ్రౌండ్ లో ఎవరో రాస్తున్న సంగతి తెలియనిదేమీ కాదన్న విజయసాయి వ్యాఖ్యలపై బుద్దా తెగ ఫైర్ అయ్యారు. సినీ నటులను విమర్శిస్తున్నారంటూ కొత్త పెడార్థాన్ని బయటకు తీశారు. సినీ నటులను ఘోరంగా అవమానించటాన్ని తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయసాయి ప్రస్తావించింది పవన్ ను అయినప్పుడు.. సినీ రంగం మొత్తానికి ఆపాదించటం బుద్ధాలాంటి బుద్దజీవులకు మాత్రమే సాధ్యమవుతుందేమో? అయినా.. ఉన్న మాట అంటే అంత ఉలుకెందుకో?


Tags:    

Similar News