కావాలంటే తాలిబన్లతో కలిసి పనిచేస్తాం..ఆ ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ తాలిబన్ల రాజ్యం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా సైన్యం వెనక్కి తగ్గగానే, తాలిబన్లు తక్కువ సమయంలోనే ఆఫ్ఘన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీనితో అమెరికా పై అనేక దేశాలు విమర్శలు చేస్తున్నా కూడా, అమెరికా మాత్రం తమ పనిని సమర్ధించుకుంటూనే , ఉగ్రవాదాన్ని మాత్రం సహించం అంటూ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే క్రమంగా తాలిబన్లకు కూడా మద్దతు పెరుగుతుందా, అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి వస్తుందో, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ను ఇప్పటికే పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ల పై మెజార్టీ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా, కొన్ని దేశాలు వారికి కూడా మద్దతుగా మాట్లాడుతున్నాయి.
ఇప్పటికే డ్రాగన్ కంట్రీ చైనా, తాలిబన్లతో దోస్తీకి సిద్ధమని ప్రకటిస్తే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం వారికి మద్దతు పలికారు. ఇక, రష్యా కూడా వారికి మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడింది. తాజాగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాక్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ సంక్షోభానికి ఓ పరిష్కారం చూపేందుకు అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు, ఆ మేరకు రాజకీయ, దౌత్యపరమైన చర్యలు చేపడతామన్నారు బోరిస్ జాక్సన్, మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు వస్తున్న ఆఫ్ఘన్ పౌరులతో కిక్కిరిసిన కాబుల్ ఎయిర్ పోర్ట్ లో పరిస్థితులు నెమ్మదిగా అదుపులోకి వస్తున్నాయని తెలిపారు.
ఇప్పటి వరకు 1,615 మందిని ఆఫ్ఘన్ నుంచి బ్రిటన్ కు తరలించామని, వీరిలో 399 మంది బ్రిటన్ కు చెందినవారు కాగా, 320 మంది రాయబార కార్యాలయ సిబ్బంది, 402 మంది ఆఫ్ఘన్ ఉన్నారని వివరించారు. ఓవైపు తాలిబన్ల చర్యల పై ఇంటి బయట వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. బహిరంగంగా మహిళలు, యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలా దేశాలు తాలిబన్ల పాలన గురించి ఊహించలేకపోతున్నారు. ఈ తరుణం లో బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలు చర్చగా మారాయి. కానీ, బోరిస్ మాత్రం రాబ్ కు అండగా నిలబడ్డారు. అఫ్గాన్ నుంచి పౌరుల్ని తరలించడంలో రాబ్ సమర్థంగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ వైపు తాలిబన్ల పాలనను గుర్తించేందుకు అనేక దేశాలు వెనుకాడుతుంటే, బోరిస్ మాత్రం వారితో కలిసి పనిచేస్తాననడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకు రష్యా, చైనా మాత్రమే తాలిబన్లకు మద్దతుగా నిలుస్తున్నాయి.