• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్ : మాజీ ఎంపీ...

బ్రేకింగ్ : మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూత

By - Tupaki Desk
Update: 2021-05-03 09:07 GMT
కరోనా జోరు దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. కరోనా కాటుకి సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ బలైపోతున్నారు. సామాన్యులతో పాటుగా పలువురు రాజకీయ నేతలు సైతం ఇప్పటికే కరోనా తో పోరాడి విజయం సాధించలేక మృతిచెందారు.  తాజాగా మరో ప్రముఖ రాజకీయ నేత కన్నుమూశారు. కరోనా బారిన పడి కొంతకాలంగా చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ సబ్బం హరి , ఆరోగ్య విషమించడంతో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొద్దిరోజుల కరోనా బారినపడ్డ ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. కొద్ది రోజుల కిందట సబ్బం హరి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయన కరోనా పాజిటివ్‌‌ గా తేలింది.

అయితే వైద్యుల సూచన మేరకు తొలుత ఆయన హోం ఐసోలేషన్‌ లో ఉన్నారు.  ఆ తర్వాత, కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో  ఆస్పత్రిలో చేరారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సబ్బం హరి ఆరోగ్యం నేడు విషమించినట్టు వైద్యులు తెలిపారు. కరోనాతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కొద్దిసేపటి క్రితం ఆయన కన్నుమూశారు. సబ్బం హరి విశాఖపట్నం మేయర్‌ గా భాద్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 15 వ లోక్ సభకు విశాఖ జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ కు ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ తో వైఎస్ జగన్ విభేదించిన సమయంలో ఆయనతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన వ్యక్తిగా సబ్బం హరి నిలిచారు. ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ వెంట నడిచారు. అయితే ఆ తరువాత  వైఎస్ జగన్‌ తో విభేదాలు రావడంతో సబ్బం హరి కొంతకాలం రాజకీయాలకు దూరమయ్యారు. అనంతరం టీడీపీలో చేరిన సబ్బం హరి  గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Tags:    
  • ex mp sabbam 
  • ex mp sabbamdeath 
  • tdp 
  • telugu desam party 
  • tdp sabbam 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS