బ్రేకింగ్: అరకులో బస్సు బోల్తా.. 8మంది మృతి

Update: 2021-02-12 15:30 GMT
విహార యాత్ర విషాదయాత్రగా మిగిలిపోయింది. ఆనందాన్ని పొందుదామని హైదరాబాద్ నుంచి అరకుకు వెళ్తున్న యాత్రికులు బస్సు ప్రమాదంలో అసువులు బాసారు. ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.విశాఖపట్నం జిల్లా అరకులో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అరకు ఘాట్ రోడ్డు పై అనంతగిరి మండలం డముకలో దినేష్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది చనిపోయినట్లు సమాచారం. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. బస్సులో మొత్తం 30 మంది పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది.మృతులంతా హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.  అధికారులు, పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
Tags:    

Similar News