తొలిమేయర్.. 25వ మేయర్ ఆయనే..

Update: 2016-02-11 09:25 GMT
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ కు తొలి మేయర్‌ గా బొంతు రామ్మోహన్‌ ఎన్నికయ్యారు. జిహెచ్‌ ఎంసి కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తరువాత మేయర్‌ పదవికి బొంతు రామ్మోహన్‌ పేరును మన్నె కవిత ప్రతిపాదించారు. అలాగే డిప్యూటీ మేయర్‌ గా బాబా ఫసియుద్దీన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరును శేషుకుమారి ప్రతిపాదించారు.

కాగా హైదరాబాద్ చరిత్రలో రామ్మోహన్ 25వ మేయర్. ఇంతకుముందు జీహెచ్ ఎంసీలో ఇద్దరు.. హైదరాబాద్ నగరపాలక సంస్థలో 22 మంది మేయర్లు పనిచేశారు.

జీహెచ్ ఎంసీ కాకముందు ఎంసిహెచ్‌ లో మేయర్లుగా పనిచేసినవారు.

1952-54    మాడపాటిహనుమంతరావు(కాంగ్రెస్‌)

1954-55    ధర్నీధర్‌ సింగ్‌(కాంగ్రెస్‌)

1955-56    షాబుద్దీన్‌ అహ్మద్‌ ఖాన్‌(కాంగ్రెస్‌)

1956-58    కిషన్‌ లాల్‌(కాంగ్రెస్‌)

1958-59    కృష్ణాస్వామి ముదిరాజ్‌(కాంగ్రెస్‌)

1959-60    రోషన్‌ అలీఖాన్‌(కాంగ్రెస్‌)

1960-61    వేద్‌ ప్రకాష్‌ దోసజ్‌(కాంగ్రెస్‌)

1961-62    రామ్మూర్తినాయుడు(కాంగ్రెస్‌)

1962-63    రాణికుముదిని దేవీ(కాంగ్రెస్‌)

1963-64    బనార్సీలాల్‌ గుప్త(కాంగ్రెస్‌)

1964-65    ఎంఆర్‌.శ్యామ్‌ రావు(కాంగ్రెస్‌)

1965-66    సరోజినిపుల్లారెడ్డి(కాంగ్రెస్‌)

1966-67    అక్బర్‌ అలీఖాన్‌(కాంగ్రెస్‌)

1967-68    కె.కొండారెడ్డి(కాంగ్రెస్‌)

1968-69    బి.కుముద్‌ నాయక్‌(కాంగ్రెస్‌)

1969-70    ఎన్‌.లక్ష్మీనారాయణ(కాంగ్రెస్‌)

1986-87    కె.ప్రకాష్‌ రావు(మజ్లీస్‌ పార్టీ)

1987-88    ఎంకె.మోబిన్‌(మజ్లీస్‌ పార్టీ)

1988-89    అనుమల సత్యనారాయణరావు(మజ్లీస్‌ పార్టీ)

1989-90    మీర్‌ జుల్ఫీకర్‌ అలీ(మజ్లీస్‌ పార్టీ)

1990-91    అల్లంపల్లి పోచయ్య(మజ్లీస్‌ పార్టీ)

2002-07    తీగల కృష్ణారెడ్డి(టీడీపీ)

జీహెచ్‌ ఎంసీలో..

2009-12    బండాకార్తీకారెడ్డి(కాంగ్రెస్‌)

2012-14    మాజీద్‌ హుస్సేన్‌(మజ్లీస్‌)

Tags:    

Similar News