వంగవీటి హత్య.. గబ్బర్ సింగ్ కు ఆ పేరుపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు!
జనసేన పార్టీ అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన పలు ట్వీట్లు చేశారు. ఇప్పుడీ ఈ ట్వీట్లు వైరల్ గా మారాయి.
ఇతరులను రాజకీయంగా ఎదగకుండా ఉండేందుకు ఆ రెండు దుష్ట రాజకీయ శక్తులు ఎంతటి దాష్టీకానికైనా ఒడిగడతాయని చెప్పడానికి మాత్రమే తాను ఈ ట్వీట్లు చేస్తున్నానని బొలిశెట్టి సత్య తెలిపారు.
వంగవీటి రంగాను కోల్పోయామన్నారు. అలాగే చిరంజీవిని రాజకీయంగా కాపాడుకోలేకపోయామని బొలిశెట్టి సత్య ఆవేదన వ్యక్తం చేశారు.
వంగవీటి రంగా 1988లో పెట్టిన కాపునాడుకు లక్షల్లో ప్రజలు హాజరయ్యారని బొలిశెట్టి సత్య గుర్తు చేశారు. దీంతో కాపుల ఆదరణ దక్కించుకోవాలంటే మనం ఏం చేయాలని.. తన మంత్రివర్గంలో ఉన్న కాపు నేత హరిరామ జోగయ్యను సలహా అడగారని బొలిశెట్టి సత్య తెలిపారు.
అప్పుడు హరిరామ జోగయ్య.. ఎన్టీఆర్ తో కాపులను బీసీలలో చేర్చడానికి ఒక కమీషన్ వేయాలని కోరారన్నారు. అలాగే వంగవీటి రంగాను కాపాడడానికి ‘గబ్బర్ సింగ్‘ గా పేరుగాంచిన పోలీసు అధికారి కె.ఎస్.ఎన్. మూర్తి విజయవాడ కమీషనర్ గా వెయ్యండి అని తెలిపారన్నారు.
ఈ రెండు పనులు చేస్తే తాను కాపులకు నచ్చజెప్పి మనవైపు వచ్చేలా చేస్తానని హరిరామ జోగయ్య.. ఎన్టీఆర్ కు తెలిపారని గుర్తు చేశారు. దీనికి ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నారని చెప్పారు. అయితే మరుసటి రోజు చంద్రబాబు ఈ రెండు నిర్ణయాలకు ఒప్పుకోవడం లేదని కాబట్టి.. ‘స్టేటస్ కో‘ మెయింటైన్ చేద్దాం అని ఎన్టీఆర్ వెనక్కి తగ్గారని సత్య వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా త్వరలో మీడియా ద్వారా వెలుగులోకి తెస్తానని తెలిపారు. పవన్ కల్యాణ్ తన సినిమా పేరు గబ్బర్ సింగ్ అని పెట్టడానికి వెనుక కూడా పెద్ద కథే ఉందని సత్య బొలిశెట్టి బాంబు పేల్చారు. పవన్ కల్యాణ్ ను తక్కువ అంచనా వేయొద్దన్నారు.
ఇప్పుడు సత్య బొలిశెట్టి ట్వీట్లు వైరల్ గా మారాయి. పవన్ కల్యాణ్ తన సినిమాకు గబ్బర్ సింగ్ అని పేరు పెట్టడం వెనుక కారణమేమై ఉంటుందని నెటిజన్లు చర్చలు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.