• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జీసస్ క్రీస్తుకు...

జీసస్ క్రీస్తుకు బ్లూటిక్.. ట్విటర్ దుర్వినియోగం షురూ

By - Tupaki Desk
Update: 2022-11-12 06:49 GMT
ట్విటర్ అధికారిక ఖాతాలకు ఇచ్చే 'బ్లూటిక్' దుర్వినియోగం అవుతోంది. 8 డాలర్లు చెల్లిస్తేనే నెలకు ఈ బ్లూటిక్ ఇస్తామని సీఈవో ఎలన్ మస్క్ చేసిన ప్రకటన తర్వాత చాలా మంది ఆ డబ్బులు కట్టి ఫేక్ ఐడీలకు కూడా బ్లూటిక్ లు తెచ్చుకుంటున్నారు. దీనివల్ల నకిలీ ఖాతాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి అసలు ఖాతాలు గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో దెబ్బకు ట్విట్టర్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ ను తొలగించారు.

బ్లూ టిక్ ప్లాన్ కోసం సీఈవో ఎలోన్ మస్క్ తీసుకొచ్చిన చెల్లింపులు దుర్వినియోగం అవుతున్నాయి.  $8 డాలర్లు చెల్లిస్తేనే నెల రోజులుు ట్విట్టర్ లో ప్రముఖులు, సంస్థలకు బ్లూటిక్ ఉంటుంది. అయితే ఇలా 8 డాలర్లు చెల్లించిన ఓ నెటిజన్ కు  ట్విట్టర్ హ్యాండిల్ బ్లూటిక్ ఇచ్చింది. అది "జీసస్ క్రైస్ట్" అకౌంట్ గా ఉండడం అందరినీ విస్తుగొలిపింది.

ఒక ట్విటర్ వినియోగదారు ఖాతాకు ప్రతిస్పందిస్తూ, "నేను ఇప్పటికీ ట్విట్టర్‌లో శాంటా (క్రీస్తు) రాక కోసం ఎదురు చూస్తున్నాను. అతను నిజమైనవాడు, నాకు అది తెలుసు!" క్రీస్తు అకౌంట్ కు బ్లూటిక్ ఇచ్చిన ట్విటర్ పై ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశాడు. ,నా ప్రభువు తిరిగి వచ్చాడు. సెయింట్ మస్క్‌కి నమస్కారాలు" అని మరొకరు సెటైర్లు వేశారు.

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇప్పుడు పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోంది..$8 నెలవారీ రుసుము చెల్లిస్తే ఎవరైనా ధృవీకరించబడిన ట్విట్టర్ ఖాతాను కలిగి ఉండవచ్చు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించినప్పటి నుండి ధృవీకరించబడిన బ్లూ టిక్‌లతో వ్యక్తులను అనుకరించే బోగస్ ఖాతాలు పెరిగిపోయాయి. ఇవి  తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయి.

ఉదాహరణకు ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులైన మాజీ బ్రిటిష్ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ మరియు జీసస్ క్రైస్ట్‌గా కొందరు పేరు మార్చుకొని అధికారిక బ్లూటిక్ తో ట్విట్టర్ ఖాతాలను ఉపయోగించడం ప్రారంభించారు. నీలిరంగు టిక్ ఇప్పటివరకు ట్విట్టర్‌లో ప్రముఖులకే ఇచ్చేవారు.  అదే అఫీషియల్ ఖాతాగా ఉండేది. కానీ ఇప్పుడు ట్విట్టర్ బ్లూ టిక్ తప్పనిసరిగా $8కి విక్రయించబడుతోంది. అనేక బోగస్ ఖాతాలు 8 డాలర్లు చెల్లించిన నిజమైన బ్లూ టిక్ లోగోతో కనిపించాయి.

"కార్పెంటర్, హీలర్, గాడ్" బయోతో జీసస్ క్రైస్ట్  ట్విట్టర్ ఖాతా ధృవీకరించబడిన బ్లూటిక్ తో కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు.  2006 నుండి ఖాతాలో బ్యాలెన్స్ ఉంది. ఎలన్ మస్క్ ప్రవేశపెట్టిన ఈ బ్లూటిక్ ప్రయోగం విఫలమైందని సోషల్ మీడియాలో ఆడిపోసుకుంటున్నారు.  జీసస్ క్రైస్తవ దేవుని కుమారుడిగా గుర్తించబడటానికి నెలకు $ 8 చెల్లిస్తే చాలని కొందరు ఈ ఫొటోతో ట్రోల్స్ చేస్తున్నారు.  నిజమైన యేసునే 8 డాలర్లతో గుర్తింపు తెచ్చుకోవచ్చని ఎద్దేవా చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TwitterOwnerElonMusk 
  • MicrobloggingSiteTwitter 
  • ChargesforTwitterVerification 
  • ElonMuskNewRulesonTwitter 
  • BlueTickForJesusinTwitter 

Similar News

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS