• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉత్తరప్రదేశ్ విభజన: ఎన్ని...

ఉత్తరప్రదేశ్ విభజన: ఎన్ని ముక్కలంటే?

By - Tupaki Desk
Update: 2021-06-11 14:38 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి దేశంలో కొత్తగా తెలంగాణను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదేబాటలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ విభజనకు కేంద్రం సిద్ధమవుతోందన్న ప్రచారంసాగుతోంది. రాజకీయ కారణాలే యూపీ విభజనకు కారణం అంటున్నారు.

దేశంలోనే అదిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎవరిది అధికారం అయితే వారిదే కేంద్రంలో అధికారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు స్థానికసంస్థల ఎన్నికల్లో తేలిపోయింది.

ఈ క్రమంలోనే తాజాగా యోగి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుసుకున్నారు. దీంతో యోగిని మార్చుతారా? రాష్ట్రాన్ని విభజిస్తారా? ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

యూపీలో సీఎం మార్పు..కేబినెట్ విస్తరణ అంశాలు తెరపైకి వచ్చాయి.  యూపీ రాష్ట్ర విభజనకు సీరియస్ గా పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విభజించి కొత్తగా ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపైనే యోగిని ఢిల్లీకి రప్పించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రాన్నిరెండు ముక్కలు చేసైనాసరే అక్కడ అధికారంలోకి రావాలని.. సీట్లు గెలవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోందని సమాచారం.

యూపీలోని గోరఖ్ పూర్ సహా 25 జిల్లాలను పూర్వాంచల్ లో కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా మోడీ సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో 125 అసెంబ్లీ సీట్లు ఉండే అవకాశం ఉంది.ఇక ఇప్పటికే యూపీలో పూర్వంచల్ తోపాటు బుందేల్ ఖండ్, హరిత ప్రదేశ్ రాష్ట్రాల డిమాండ్ ఉంది.దీంతో ఏం జరుగుతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
Tags:    
  • Uttar Pradesh 
  • BJP 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS