ఓటమి వేటు.. నైతిక బాధ్యత పేరు తో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కి రాజీనామా
గెలుపు సంబరాన్ని తీసుకొస్తే.. ఓటమి అంతులేని వేదనను మిగులుస్తుంది. స్థాయి ఎంతదైనా.. వ్యక్తి ఎంతటి మొనగాడైనా వారి వరకూ వచ్చే సరికి ఓటమి ఓటమే. దాన్ని ఎదుర్కోవటం అంత తేలిక కాదు. తాజాగా ఓటమి తాలుకూ ప్రభావం జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మీద పడింది. మొన్నటి వరకూ అధికారపార్టీ అధ్యక్షుడి గా చెలరేగి పోయిన ఆయన తాజాగా తన ఓటమికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
పార్టీ ఓటమి వేళ.. తన కారణంగానే అంతా జరిగినట్లుగా ఫీలైన లక్ష్మణ్ గిలువా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయటాన్ని ఎవరూ అభ్యంతరం పెట్టకపోవచ్చు కూడా. ఎందుకంటే.. అధికారపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన తాజాగా జరిగిన ఎన్నికల్లో చక్రధర్ పూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి సుఖ్ రామ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
మరి.. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ ముషీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగా బరి లోకి దిగి ఓడి పోయారు కదా? అప్పుడు ఆయన తన పదవికి రాజీనామా ఎందుకు చేయలేదన్న డౌట్ అక్కర్లేదు? ఎందుకంటే.. తెలంగాణ లో బీజేపీ కి ఉన్న బలానికి జార్ఖండ్ లో బీజేపీ బలానికి పొంతన లేదు. అధికార పార్టీ ని పరాజిత పార్టీ గా మార్చినందుకు లక్ష్మణ్ గిలువా మూల్యం చెల్లించక తప్పదు కదా. ఇక.. 81 స్థానాలున్న అసెంబ్లీలో 47 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. జేఎంఎం అండ్ కో కూటమి ఈ నెల 29న ప్రమాణస్వీకారం చేయనున్నారు.