బాబుని కూడా వాడుకుంటాం....బీజేపీది బుర్రే బుర్ర

Update: 2022-11-29 00:30 GMT
రాజకీయాల్లో వాడుకోవడం వెరీ కామన్. వాడుకోవడానికే కారెవరూ అనర్హం అని  కూడా చెప్పాలి. ఇక రాజకీయాల్లో తాడిని తన్నే వారు ఒకరు ఉంటే తలను తన్నే వారు మరొకరు ఉంటారు. ఏపీ రాజకీయాల వరకూ చూస్తే చంద్రబాబుకు మించిన రాజకీయ ఘనాపాటి ఎవరూ ఉండబోరని అంతా అనుకుంటారు.

అయితే కాలానికి తగినట్లుగా వ్యూహాలను ఎవరైనా సిద్ధం చేసుకోకపోతే దెబ్బ అవుతారు. దానికి తోడు ఎప్పటికపుడు పోటీ కూడా నడుస్తూ ఉంటుంది. అలా కనుక చూసుకుంటే యంగ్ లీడర్స్ గా జగన్ అల్ రేడీ ఎమర్జ్ అయి ఉన్నారు. ఇక పవన్ కూడా తన సత్తాను చూపిస్తాను అని అంటున్నారు. దాంతో బాబు రాజకీయానికి గతంలో ఎన్నడూ లేని పోటీ ఏర్పడింది.

అందువల్లనే పొత్తుల లెక్కలు కూడా ఆయన అనుకుంటున్నట్లుగా కాకుండా గురి తప్పుతున్నాయి. 1999 - 2004 - 2009 - 2014 ఎన్నికల్లో బాబు సులువుగా పొత్తులు పెట్టుకోగలిగారు. కానీ 2019 నుంచి సీన్ మారుతోంది. ఇక 2024 ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉంటాయో బాబుకే తెలియదు అంటున్నారు. అప్పట్లో పొత్తులు అంటే బాబు కోరుకున్నట్లుగా ఏకపక్షంగా అంతా సాగిపోయేది.

ఇపుడు మాత్రం అలా కాదు, అవతల వారు డిమాండ్ చేస్తున్నారు. వారు చెప్పినట్లుగా వినాల్సి వస్తోంది. ఎన్నో సార్లు టీడీపీ ముందు తగ్గిన బీజేపీ ఇపుడు బాబుకు అందకుండా పోతోంది. గత మూడున్నరేళ్ళుగా చంద్రబాబు కమలంతో కరచాలనం చేద్దామని చూస్తున్నా కూడా అది సాధ్యపడడంలేదు అంటే బాబుకు రాజకీయ వ్యూహాలు తెలియవు అని కాదు, ఆయన రాజకీయ పారడం లేదు అని అర్ధం చేసుకోవాలి.

ఏపీలో మరో రెండు ప్రాంతీయ పార్టీలు ఆప్షన్ గా బీజేపీకి ఉన్నాయి. ఒకటి తెర వెనక, ఒకటి తెర ముందు నిలిచి జై కొడుతూంటే బాబుతో పనేమింది. ఆయన పెట్టే కండిషన్లు పట్టించుకునే వారు ఎవరు. అందుకే బాబు ఇపుడు ఢిల్లీ బీజేపీ ముందు తెల్లబోతున్నారు. ఇదిలా ఉండగా బీజేపీకి బాబుతో దోస్తీ ఇష్టమే అయితే వారు కోరుకున్న ఏరియాల్లో వాడుకోవడానికే ఇష్టపడతారు అంటున్నారు.

ఏపీలో బీజేపీకి బాబు అవసరం లేదుట. అదే తెలంగాణాలో అయితే బాబు అవసరం ఎంతో కొంత ఉంటుందీని లెక్కలేసుకుంటున్నారు. అదెలా అంటీ తెలంగాణాలో టీడీపీకి చెప్పుకోదగిన ఓట్లు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. హైదరాబాద్ తో పాటు దక్షిణ తెలంగాణా జిల్లాలలో తెలుగుదేశానికి ఉన్న ఓట్లు తమ వైపుగా టర్న్ అవుతాయేమో అన్న ఆశ బీజేపీ పెద్దలకు ఉంది.

అందుకే వారు బాబును మరీ దూరం పెట్టకుండా అపుడపుడు అధికారిక కార్యక్రమాలకు ఏపీ నుంచి విపక్ష నేతగా పిలుస్తున్నారు అని అంటున్నారు. తెలంగాణా బీజేపీకి ఫస్ట్ ప్రయారిటీ. అందువల్ల అక్కడ టీడీపీ సాయం తీసుకుని ఏదో విధనా ఒడ్డున పడాలని చూస్తోంది. అదే ఏపీ వరకూ వస్తే పవన్ కళ్యాణ్ అండతో ఇక్కడ నిలిచి గెలవాలని వ్యూహ రచన చేస్తోంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రకాలైన రాజకీయానికి బీజేపీ స్కెచ్ గీసి ఉంచింది.

అయితే ఇపుడు బీజేపీది పై చేయిగా ఉంటోంది. కాబట్టి బాబు కూడా ఏమి చేసేది లేదు అని అంటున్నారు. బాబు సైతం తెలంగాణాలో ముందు చేతులు కలిపితే ఆ మీదట ఏపీలో కూడా బీజేపీ స్నెహాన్ని విస్తరించుకోవచ్చు అని చూస్తున్నారు అంటున్నారు. అందుకే ఆయన సైతం కమలం చేయిని వీడేందుకు ఇష్టపడంలేదు అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. తెలంగాణాలో బీజేపీ పాచిక పారాలి. అక్కడ నిజంగా టీడీపీ ఓటు బ్యాంక్ నిలిచి ఉంటే అది బీజేపీకి టర్న్ అయి ఫలితాలు వస్తేనే బాబుతో ముందు ముందు బీజేపీ అడుగులు వేసేది అని అంటున్నారు.
4

ఆ విషయంలో గట్టి హామీని బాబు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే 2014 తరువాత నుంచి చూస్తే తెలంగాణాలో టీడీపీ ఎత్తిపోయిన పరిస్థితి ఉంది. ఉంటే గింటే నామమాత్రంగా సీన్ ఉంది. అయితే నియోజకవర్గానికి కనీసం వేయి ఓట్లు ఉన్నా కూడా అది బీజేపీకి లాభమే. అందువల్లనే బీజేపీ టీడీపీని వాడుకోవాలని చూస్తోంది అంటున్నారు.

మరో వైపు చూస్తే చంద్రబాబుకు ఎంతో కొంత ప్రాధాన్యత బీజేపీ ఇవ్వడానికి కారణం మీడియా మొఘల్ గా ఉన్న ఒక పెద్దాయన మాట కూడా ఉంది అంటున్నారు. అలాగే నందమూరి మూడవ తరం వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మీద బీజేపీకి కన్ను ఉంది. అందువల్లనే ఇపుడు బీజేపీ బాబుతో కొంత సానుకూలంగా ఉన్నట్లుగా ఉంది. అయితే ఇది ఫక్తు వాడుకునే రాజకీయమే అన్నది బాబుకు కూడా తెలియనిది కాదు. కానీ చిన్నపాటి స్పేస్ ఇచ్చినా అల్లుకుపోయే రాజకీయ గండరగండడు బాబు కాబట్టి బీజేపీ మోడీ అమిత్ షాల ఎత్తులకు బాబు మార్క్ పై ఎత్తులు ఎలా ఉంటాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News