మీరూ మీరూ కొట్టుకోండి...ఏపీలో బీజేపీది ప్రేక్షక పాత్రట...?
ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి బీజేపీ ఏ విధంగా వ్యవహరించబోతోంది అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఎందుకంటే బలమైన నాయకుడు నరేంద్ర మోడీ. వ్యూహచతురుడు అమిత్ షాల నేతృత్వంలో నడిచే పార్టీ అది. ఏ చిన్న అవకాశం ఇచ్చినా మొత్తానికి మొత్తం అల్లుకుని పోయే తెలివి తేటలు ఉన్న పార్టీ కూడా అదే. ఈశాన్య రాష్ట్రాలలో ఇసుమంతైనా జాగా లేని చోట సైతం జెండా పాతేసిన పార్టీ బీజేపీ. అలాంటి బీజేపీకి ఏపీ అంటే విరక్తి ఎందుకు ఉంటుంది.
పైగా పాగా వేయాలని ఎన్నో ఎత్తులు వేస్తూ ఉంటుంది కదా అని అనుకుంటారు. కానీ బీజేపీకి సౌత్ స్టేట్స్ మీద ఎంత ఆసక్తి ఉన్నా అంతకు మించి కచ్చితమైన ఆలోచనలు లెక్కలు ఉన్నాయి. ఏపీలో బీజేపీకి గేట్ వే తెలంగాణావే తప్ప మరోటి కాదు అన్నది బీజేపీ నమ్మకం. ఇక ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటి విషయంలో ఏదో ఒకటి తేలిపోయి పక్కకు పోతే తప్ప తమకు ఒనగూడేది ఏదీ లేదు అన్నది కూడా బీజేపీకి బాగా తెలుసు అంటున్నారు.
అందుకే ఏపీ పాలిటిక్స్ లో బీజేపీ జస్ట్ అలా వాచ్ చేయడమే తప్ప ఏమీ చేయకూడదు అని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. దీని వల్ల బీజేపీకి లాభాలే తప్ప మరేమీ నష్టాలు లేవు. అదెలా అంటే ఏపీలో తెలుగుదేశం గెలిచినా లేక వైసీపీ మరోసారి గెలిచినా బీజేపీ జట్టు కట్టాల్సిందే. అంటే ఏపీలో తన రాజకీయ బలానికి ఢోకా లేదు అన్న మాట.
మరి ఈ సత్యం తెలిసిన తరువాత న్యూట్రల్ గా ఉండకుండా ఆయాసపడడం ఎందుకు దండుగ అన్న రాజనీతి ఆ పార్టీది. ఇకపోతే ప్రస్తుతానికి వైసీపీ బీజేపీకి సన్నిహితంగా ఉంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు. రానున్న పదిహేను నెలలలో ఎన్నో కీలకమైన బిల్లులను బీజేపీ ఆమోదించుకోవాలనుకుంటోంది. దానికి వైసీపీ మద్దతు చాలా అవసరం. అందుకోసం వైసీపీని దూరం చేసుకోదు అనే చెబుతున్నారు.
అందుకే జనసేన రూట్ మ్యాప్ అడిగినా మరో విధంగా పోరాటానికి రమ్మని కోరినా బీజేపీ పెద్దలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే పరిణామాలు మారుతున్నాయి. పవన్ తన ఆలోచనలు మెల్లగా బహిర్గతం చేస్తున్నారు. ఏపీలో తెలుగుదేశంతో తాను వెళ్లాలనుకుంటుంటున్నట్లుగా ఆయన చెబుతున్నారు. అయినా బీజేపీ మాత్రం పెద్దగా కంగారు పడడంలేదు. తాము మాత్రం అలాగే న్యూట్రల్ గానే ఉండాలని అనుకుంటోంది. పార్టీ వారికీ అదే చెబుతూ వస్తోంది.
ఏపీలో 2024 ఎన్నికల్లో వైసీపీ టీడీపీల మధ్య భీకర యుద్ధం జరిగి వైసీపీ మరోసారి గెలిసే అది తమకు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు చాలా లాభకరంగా ఉంటుంది. అదే సమయంలో తెలుగుదేశం అధికారంలోకి రాకుండా ఓటమిపాలు అయితే తమ రొట్టె విరిగి నేతిలో పడినట్లే అని బీజేపీ భావిస్తోంది. ఇక ఏపీలో పొలిటికల్ స్పేస్ కావాల్సినంత ఏర్పడుతుందని దాన్ని వాడుకోవచ్చు అని కూడా భావిస్తోంది.
అందువల్ల తమకు తెలిసి ఎరిగి ఏపీలో తెలుగుదేశాన్ని పెంచి పెద్ద చేసే పనులు ఏ మాత్రం చేయరాదని బీజేపీ ఒట్టేసుకుని కూర్చుంది. మొత్తానికి చూస్తే బీజేపీ జాతీయ పెద్దలు ఆలోచనలు అన్నీ కూడా వైసీపీ తెలుగుదేశం ల మధ్య రాజకీయ సమరం జరిగితే అలా ప్రేక్షక పాత్రలో ఉంటూ చూడాలనే ఉందిట.
తమకు శాశ్వత ప్రయోజనాలు ముఖ్యమని, పొత్తులతో వచ్చే రెండో మూడో సీట్లో ఒకటో రెండో మంత్రి పదవులు ముఖ్యం కాదని బీజేపీ జాతీయ నేతలు గట్టిగా భావిస్తున్నారుట. అందువల్ల 2024 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోరు చేస్తుంది అని అంటున్నారు. తెలుగుదేశం కూటమిలో చేరే అవకాశాలు ఏ మాత్రం లేవు అని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏమి జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.