రాంమాధవ్ అత్యుత్సాహం , తానా కుసంస్కారం!
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభలు గత కొంతకాలంగా తెలుగు మీడియాలో చర్చనీయాంశంగా నిలుస్తూ వచ్చాయి. ఆ కార్యక్రమాలకు ఎవరెవరు వెళ్తారనే అంశం గురించి తెలుగు మీడియా పెద్ద ఎత్తున చర్చ నిర్వహిస్తూ వచ్చింది. కొంతమంది ఈ సభలకు తమకు ఆహ్వానం వచ్చినట్టుగా గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఎవరు ఎలా చెప్పుకున్నా.. ‘తానా’కు అప్పటికే ఒక గుర్తింపు ఉంది. అది నార్త్
అమెరికాలోని తెలుగు వారి సంఘం కాదు, అక్కడ ఉండే ఒక సామాజికవర్గం వాళ్ల సంఘం అనే పేరుంది. ఆ సంస్థలో అంతా ఒక సామాజికవర్గం వారిదే ఆధిపత్యం, వారి కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం అంతా నడుస్తుందనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆ సంస్థ కార్యకలాపాలను పరిశీలించే వారిలోనే ఆ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. మరి అలాంటి సంస్థ నుంచి ఎంత ఆహ్వానం వస్తే మాత్రం ఏపీ బీజేపీ నేతలు ఎందుకు ఎగేసుకుని వెళ్లారు? అనేది కూడా చర్చనీయాంశం.
తానా పూర్తిగా తెలుగుదేశం పార్టీ పక్ష సంస్థ అనే టాక్ కూడా ఉండనే ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే తానాకు పడదు. మధ్యే మార్గంగా..కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్నారనే లెక్కలతో బీజేపీ వాళ్లను తానా వాళ్లు పిలిచినట్టుగా ఉన్నారు.
ఈ మాత్రం దానికి అసలు విషయం గుర్తించకుండా భారతీయ జనతా పార్టీ వాళ్లు అమెరికాకు వెళ్లడానికి ఎగబడ్డారు! చివరకు ఏమైంది? బీజేపీకి దేశంలోనే తురుపు ముక్క అనే ప్రచారం పొందుతూ ఉన్న రాంమాధవ్ కు తానాలో అవమానం జరిగింది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ తెగ వాపోతూ ఉంది!
ఎక్కడకు వెళ్తున్నారు.. ఏం చేస్తున్నారు.. అనే ప్రాథమిక అవగాహన భారతీయ జనతా పార్టీ వాళ్లకు ఉన్నట్టే లేదు. తానా సభల విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్లు ముందు మరో రకమైన ప్రచారం కూడా చేసుకున్నారు.
అక్కడకు రాంమాధవ్ వెళ్తారని, అక్కడకు వచ్చే తెలుగుదేశం పార్టీ వాళ్లందరితోనూ ఆయన చర్చలు జరుపుతారని, వారందరినీ బీజేపీలోకి చేర్చుకోవడం విషయంలో రాంమాధవ్ అక్కడ ప్రణాళికను అమలు పెడతారని కమలం పార్టీ వాళ్లు ప్రచారం చేసుకున్నారు.
తానా సభలు అయిపోయేలోపు ఏపీ లో తెలుగుదేశం పార్టీని చాపచుట్టేసినట్టుగా చుట్టేసి రాంమాధవ్ తన బ్యాగ్ లో పెట్టేసుకుంటారని బీజేపీ వర్గాలు ప్రచారం చేశాయి. తీరా అక్కడ జరిగింది రాం మాధవ్ కు అవమానం! ఇంతోటి దానికి ఆయన ఆ సభకు జరగడం హాస్యాస్పదంగా ఉందని పరిశీలకులు అంటున్నారు.
రాంమాధవ్ కు బీజేపీలో ఒక పేరుంది. అదేమిటంటే.. విదేశాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలను ఆయన బ్రహ్మాండంగా నిర్వహిస్తారని ఇన్నేళ్లూ ఒక ప్రచారం ఉండేది. గతంలో ప్రధాని కాగానే మోడీ అమెరికాకు వెళ్లగా అక్కడ సభకు, సమావేశాలకు ఏర్పాట్లన్నీ రాంమాధవే చేశారు.
అయితే ఇప్పుడు కూడా ఆయన అదే అతివిశ్వాసంతో తెలుగుదేశానికి సంబంధించిన తానా సమావేశానికి హాజరు అయినట్టుగా ఉన్నారు. అనువుగాని చోటుకు వెళ్లినట్టుగా ఉన్నారు. అక్కడ ఆయనకు అసలు కథ అర్థం అయ్యింది. మొత్తానికి తానా సభలతో ఆ సంస్థ సభ్యుల్లోని కుసంస్కారం, రాంమాధవ్ అత్యుత్సాహం రెండూ బయటపడ్డాయని పరిశీలకులు అంటున్నారు.