కేసీఆర్.. కేటీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తే చించేయంది.. ఎంపీ సంచలన పిలుపు
దూకుడుగా మాట్లాడటమే కాదు.. ఆవేశపూరిత వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు ఎంపీ ధర్మపురి అరవింద్. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులుగా మారారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఇంత తీవ్రస్థాయిలో.. ఘాటుగా విమర్శించే నేతల్లో అరవింద్ ఒకరుగా చెప్పాలి. అలాంటి ఆయన తాజాగా గ్రేటర్ లో జరుగుతున్న ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కేసీఆర్.. కేటీఆర్ ఫ్లెక్సీలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘జీహెచ్ఎంసీ నీ అయ్య సొత్తు కాదు కేటీఆర్. నీవు ఒక మునిసిపల్ మంత్రివి. నీ ఇష్టానుసారంగా ఏజన్సీలకు రాత్రికి రాత్రే హోర్డింగ్ లు పెట్టేందుకు ఆర్డర్ లు ఇస్తే చూస్తూ ఊరుకోవాలా?’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయాన్ని కార్యకర్తలకు చెబుతూ.. స్తంభాలకు.. రోడ్లపైనా.. టాయిలెట్లమీదా కేసీఆర్.. కేటీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారన్నారు. ఇలాంటివి ఎక్కడ కనిపిస్తే.. అక్కడ వాటిని చించేయాలని పిలుపునిచ్చారు. తాను మాటలతో చెప్పటమే కాదు.. చేతల్లో కూడా చేసి చూపించారు. కేబీఆర్ పార్కు వద్ద.. ఏర్పాటుచేసిన భారీ ఫ్లెక్సీని దగ్గరుండి మరీ చించేయించారు. మరీ.. విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మహానగరంలో మరెవరికీ అవకాశం దక్కకుండా.. అన్ని హోర్డింగుల్ని తమ అధీనంలో వచ్చేలా చేసుకున్నారన్న ఆరోపణ భారీగా వినిపిస్తోంది. మిగిలిన నేతలకు తాను భిన్నమని.. మాటలే కాదు.. చేతల్లో చేసి చూపిస్తానన్న విషయాన్ని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారని చెప్పక తప్పదు.