ఆ రహస్యం ఈటలకే ఎరుక !
మమతాపై గెలిచిన సువేందు అధికారి మాదిరిగా ఈ సారి తాను కేసీఆర్ పై పోటీ చేసి గెలిచి బీజేపీ జెండా ఎగురవేస్తానని ఈటల అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఆ పాటి రిజల్ట్ రావాలి అంటే కేసీఆర్ ఢీ కొనాలంటే ఈటల ఒక్కరే కాదు బీజేపీ అంతా ఒక్కటైనా కష్టమే! ఎందుకంటే కేసీఆర్ లాంటి బలీయమైన నాయకులను ఢీ కొంటూ రాజకీయం చేయడం సులువు అయిన పని కాదు. ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ అభిమానులతో చాలా వరకూ నిండిపోయిన బీజేపీతో అది అస్సలు సాధ్యం కాదు. కానీ కేసీఆర్ తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో చెప్పనైనా చెప్పకుండా ఈటల మాటల యుద్ధం మొదలు పెట్టడం వెనుక సిసలు కారణం ఏంటి ?
వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీచేస్తానని చెప్పి సంచలనం అయ్యారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేసి తన సత్తా ఏంటన్నది చాటాలన్నది, ఆ విధంగా తన గెలుపును చాటింపు వేయాలన్నది ఈటల ఆలోచన లేదా వ్యూహం కావొచ్చు. అయితే తాను ఇప్పటి నుంచే ఇందుకు సంబంధించి స్కెచ్ వేస్తున్నానని చెప్పేశారు.
ఇందుకు సంబంధించి రహస్య ఆపరేషన్ కూడా జరుగుతోందని కూడా చెప్పేశారు. అయితే ఇవి నమ్మశక్యాలా లేదా మైండ్ గేమ్ లో భాగమా అన్నది తేలాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎటు ఉన్నా ఈటల పంతాలు నెగ్గి తీరాల్సి ఉంది. ముఖ్యంగా ఈటల తనదైన పంథాలో టీఆర్ఎస్ అసంతృప్తులను తానున్న భారతీయ జనతా పార్టీలోకి తెచ్చేందుకు చూస్తున్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.
హుజురాబాద్ లో గెలిచినందుకు బీజేపీ ఆయకు జాతీయ కార్యవర్గంలో చోటు ఇచ్చింది. బాగుంది కానీ ఆ రోజు కూడా ఈటల గెలుపు సునాయాసం కాలేదు. ఈటలకు రెడ్ల సాయం ముఖ్యంగా ఏపీ సీఎంకు చెందిన మనుషులు కూడా సాయం చేసి ఉన్నారన్న వాదన ఒకటి వచ్చింది. కాంగ్రెస్ ముందే అస్త్ర సన్యాసం చేసినా కూడా కేసీఆర్ అనుకున్న ఫలితం సాధించకపోవడానికి కారణం అక్కడ ఈటలపై ఉన్న సానుభూతి. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి నియోజకవర్గం మార్పునకు సంబంధించి ఈటల చెప్పడం వెనుక దాగి ఉన్న సిసలు కారణం ఏంటి? ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? ఇవే ఇప్పుడు రాజకీయంగా చర్చకు తావిస్తున్నాయి.