జైలుకెళ్లినా ఆ బీజేపీ ఎమ్మెల్యే బ‌లుపు త‌గ్గ‌లేదుగా!

Update: 2019-07-01 05:32 GMT
ఒక త‌ప్పు చేసి అడ్డంగా బుక్ అయ్యాక కాస్త వెన‌క్కి త‌గ్గ‌టం చూస్తుంటాం. కానీ.. ఈ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నం. ప‌బ్లిక్ గా క్రికెట్ బ్యాట్ తో అధికారుల్ని ఉరుకులెత్తించిన తీరు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్న అధికారుల మీద అత‌గాడు విరుచుకుప‌డిన తీరు చూసినోళ్లంతా ముక్కున వేలేసుకున్న ప‌రిస్థితి.

అధికారం ఎంత‌లా ఎక్కేస్తే.. అంత‌లా చేస్తార‌న్న విమ‌ర్శ‌కు త‌గ్గ‌ట్లే అత‌గాడి తీరు ఉంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. అధికారుల‌పై క్రికెట్ బ్యాట్ తో దాడి చేసిన ఉదంతంలో నాలుగు రోజులు జైలుకు వెళ్లి వ‌చ్చిన ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే గోరోజ‌నం మాత్రం అస్స‌లు త‌గ్గ‌లేద‌న్న మాట వినిపిస్తోంది.

జైలుకు వెళ్లి వ‌చ్చిన అనంత‌రం తాజాగా మాట్లాడి ఆయ‌న‌.. అధికారిపై తాను దాడి చేసినందుకు అస్స‌లు బాధ ప‌డ‌టం లేద‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. మ‌రోసారి బ్యాటింగ్ చేయాల్సిన అవ‌స‌రం రావొద్ద‌నే దేవుడ్ని ప్రార్థిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు.

పోలీసుల ముందే ఒక మ‌హిళ‌తో దురుసుగా వ్య‌వ‌హ‌రించిన అధికారిని అంత‌కంటే ఏం చేయాలో అర్థం కాలేద‌న్న కొత్త మాట‌ను తెర మీద‌కు తెచ్చిన అత‌గాడి తీరు చూస్తుంటే.. జైలుకు వెళ్లి వ‌చ్చినా అత‌డిలో ఎలాంటి ప‌శ్చాత్తాపం రాలేదు స‌రిక‌దా.. ఈసారి మ‌రింత‌గా రెచ్చిపోవ‌టం ఖాయ‌మ‌న్న‌ట్లుగా అత‌గాడి మాట‌లు ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. జైలుకు వెళ్లి వ‌చ్చినా బ‌లుపు ఏ మాత్రం త‌గ్గ‌ని ఈ బీజేపీ ఎమ్మెల్యేతో ఆ పార్టీకి త‌ల‌నొప్పులు ఖాయ‌మ‌న్న‌ట్లుగా అత‌డి వ్య‌వ‌హారం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News