మోడీ ఇపుడైన ఆలోచించుకోవాలి
భారతీయ జనతాపార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా వరుసగా ఎదురవుతున్న వైఫల్యాల జాబితాలో ఇపుడు బీజేపీ పాలిత రాష్ర్టమైన మధ్యప్రదేశ్ వచ్చి చేరింది. యథావిధిగా కాంగ్రెస్ చేతిలో ఆ పార్టీ ఓటమి పాలైంది. మధ్యప్రదేశ్ లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలి మొత్తం 8 స్థానాల్లో 5 చోట్ల ఓటమి కూడగట్టుకుంది. మూడు స్థానాల్లో గెలుపు మాత్రమే సాధించింది. ఆ ఐదు స్థానాల్లోనూ కాంగ్రెస్ విక్టరీ సాధించింది. గతంలో ఈ 8 స్థానాల్లో ఏడింటిని బీజేపీ గెలవగా ఈసారి ఘోర ఓటమి మూటగట్టుకుంది.
మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ బీజేపీ పరాభవం చెందుతూ వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదట ఢిల్లీలో ఓటమి - ఆ తర్వాత కశ్మీర్ లో - అనంతరం మహారాష్ర్ట - ఉత్తర్ ప్రదేశ్ లలో బీజేపీ వైపల్యం చెందింది. పటేళ్ల ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్ చాలాకాలం తర్వాత మోడీ సొంత రాష్ర్టమైన గుజరాత్ లో లాభపడింది. ఆ రాష్ర్టంలో జరిగిన పురపాలక - స్థానిక సంస్థల ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు మూటగట్టుకుంది. గ్రామీణప్రాంతాల్లో కాంగ్రెస్ అధికార బీజేపీ కంటే పైచేయిలో నిలిచింది. వడోదరలో 176 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 94 - బీజేపీ 72 గెలిచాయి. ఉదయ్‌పూర్ జిల్లాలలో 32 పంచాయతీల్లో కాంగ్రెస్21, బీజేపీకి 10 దక్కాయి. జామ్ నగర్ లో ఆరు పంచాయతీల్లో కాంగ్రెస్ గెలువగా బీజేపీ దారుణంగా ఓడిపోయింది. దాహోద్ జిల్లాలో కాంగ్రెస్ కు 16, బీజేపీకి 15 లభించాయి. సూరత్ కార్పొరేషన్ పరిధిలో 115 సీట్లలో 32 కాంగ్రెస్ బీజేపీ 20 సీట్లలో గెలిచాయి.
మొత్తంగా మోడీ అధికారంలో వచ్చే సమయంలో బీజేపీకి ఉన్నంత ఊపు ఇపుడు తగ్గిందేమో అనే సందేహాలు కలిగేలా వరుస ఫలితాలు వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.