హోదా ఇవ్వరట.. స్నేహహస్తం ఇస్తారట!

Update: 2019-07-17 08:16 GMT
ఒకవైపు తాము ఏపీలో బలోపేతం అవుతున్నామని, కాబోతున్నామని కమలనాథులు చెబుతూ ఉంటారు. అయితే ఏవో చేరికలను చూసుకుని వారు అలా మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే అవకాశవాద రాజకీయ నేతలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా దాంట్లోకి చేరిపోతారు. అయితే ప్రజలు మాత్రం అన్నీ గమనించే నిర్ణయాలు తీసుకుంటారని కచ్చితంగా చెప్పవచ్చు.

అయితే ఈ విషయం కమలనాథులు పట్టించుకోరు. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలకు సహకరించేది లేదని వారే తేల్చి చెబుతూ ఉంటారు. మరోవైపు తాము రాష్ట్రం కోసం పాటు పడుతున్నట్టుగా ప్రకటించుకుంటూ ఉంటారు.

అందుకు తగ్గట్టుగానే మాట్లాడారు బీజేపీ నేత పురందేశ్వరి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇచ్చే ఉద్దేశం కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీకి లేదని ఆమె మరోసారి తేల్చారు. అయితే ఏపీ ప్రభుత్వానికి తాము స్నేహహస్తం ఇస్తామంటూ చెప్పుకొచ్చారు.

రాష్ట్ర అభ్యున్నతి కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ నుంచి స్నేహహస్తం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అయినా తామే హామీ ఇచ్చిన హోదా ఇవ్వకుండా ఇలాంటి ఉత్తుత్తి మాటలు, హ్యాండ్ ఇవ్వడాలు ఎందుకో కమలం పార్టీకే తెలియాలి. ఇలాంటి మాటలతో భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం నేతలే తమ పార్టీని మరింతగా దెబ్బతీసుకుంటున్నారు అని పరిశీలకులు అంటున్నారు.


    

Tags:    

Similar News