బీజేపీ లీడర్ భలే కిలాడీ..వ్యభిచార రాకెట్‌ నిర్వహిస్తూ కటకటాలపాలు

Update: 2020-10-04 07:50 GMT
ఏదో ఒక రాజకీయ పార్టీలో క్రియాశీలంగా ఉంటూ ఏదో ఒక విధంగా జనాన్ని దోచుకునే రాజకీయ నాయకులు రోజు రోజుకూ పెరిగి పోతున్నారు. పైకి ఏమో ఖద్దరు ధరించి పెద్ద మనుషుల్లా ఉంటూ నీచపు పనులకు ఒడిగట్టడం కామన్ గా మారింది. ఏదో ఒక పార్టీలో తప్పు చేసి దొరికినా పోలీసు కేసుల నుంచి తప్పించు కునేందుకు రాజకీయాలను అడ్డుగా పట్టుకుంటున్నారు.  రాజస్తాన్‌లో ఓ వ్యభిచార రాకెట్‌ నిర్వహణలో బీజేపీ  ప్రముఖ నాయకురాలి హస్తం ఉండటంతో సంచలనంగా మారింది. యువతులకు డబ్బు ఆశ చూపి, లేదంటే భయపెట్టి వ్యభిచారకూపంలోకి దించి సంపాదిస్తోందనే ఆరోపణలు వినిపిస్తిన్నాయి. ఆమె ఈ బిజినెస్ లో బాగా ఆరితేరిందనే విమర్శలు వస్తున్నాయి.

రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో వ్యభిచార రాకెట్‌ బయటపడింది. ఈ వ్యభిచార రాకెట్‌ను బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సునీతా వర్మ నిర్వహిస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెపై చర్యలకు రంగంలోకి దిగారు. పలువురు యువతులకు ఆమె డబ్బు ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒకవేళ వ్యభిచారం చేసేందుకు యువతులు ఒప్పుకోకపోతే బెదిరించి మరీ ఒప్పిస్తున్నట్లు తెలిసింది.  పోలీసులు ఆమెను ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలియడంతో పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. తనను బయపెట్టి వ్యభిచారం చేయిస్తున్నట్లు 17ఏళ్ల యువతి పోలీసులకు  ఫిర్యాదు ఇవ్వడంతో వారు విచారణ నిర్వహించి ఈ వ్యభిచార రాకెట్‌ గురించి బట్టబయలు చేశారు. ఈ కేసుతో సంబంధమున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఒక మహిళను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రముఖ నాయకురాలు వ్యభిచార రాకెట్‌ నిర్వహిస్తూ పట్టుబడటం రాజస్తాన్ లో సంచలనంగా మారింది.
Tags:    

Similar News