182 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న బీజేపీ!
అవును.. వివిధ పార్టీలకు చెందిన 182 మంది ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తమలో కలిపేసుకుంది. గడిచిన నాలుగు సంవత్సరాల్లోనే ఇంత మందికి కాషాయ కండువా కప్పింది ఆ పార్టీ. 2016-20 మధ్య కాలంలో దేశంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై ఓ సంస్థ నిర్వహించింది. ఇందులో ఆశ్చర్యపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.
'అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' అనే సంస్థ ఈ సర్వే చెప్పింది. ఎంత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు? ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్లారు? అనే వివరాలను ఈ సర్వే సేకరించింది. ఈ సర్వే ప్రకారం.. దారుణంగా దెబ్బతిన్న పార్టీ ఏదంటే.. కాంగ్రెస్ మాత్రమే!
దేశవ్యాప్తంగా ఆ పార్టీ నుంచి 2016-20 మధ్య కాలంలో ఏకంగా 170 మంది ఎమ్మెల్యేలు వివిధ పార్టీల్లో చేరిపోయారు. అదే సమయంలో బీజేపీ నుంచి కేవలం 18 మంది మాత్రమే బయటకు వెళ్లారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలంతా ఎన్నికల సమయంలోనే కండువాలు మార్చారని నివేదిక వెల్లడించింది.