తిరుపతి కోసం బీజేపీ-జనసేన స్కెచ్

Update: 2021-01-26 10:30 GMT
తిరుపతి ఉప ఎన్నిక ఏపీలో హీట్ పెంచుతోంది. ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ-జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ బలంగా నిలబడుతున్న వేళ బీజేపీ-జనసేన వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ గెలుపు కోసం అహర్నిశలు పాటు పడుతోంది. ఇదే క్రమంలో కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తున్నాయి.

వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కుటుంబానికి కాకుండా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతున్నాయి. గురుమూర్తిని దాదాపుగా ఖాయం చేశాయి. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ ఇప్పటికే ఖరారయ్యారు. ఇప్పుడు ఇరుపార్టీలు ఇప్పుడు మరో కొత్త ఆప్షన్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

సహజంగానే బీజేపీలో మేధావులు, బ్యూరోక్రాట్లకు పెద్దపీట వేస్తారు.  ఈ క్రమంలోనే బీజేపీతోపాటు జనసేన కూడా ఇప్పుడు ఓ కొత్త అభ్యర్థి విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

తిరుపతిలో జనసేన లేదా బీజేపీ ఎవరు పోటీచేసినా గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.  బీజేపీ తరుఫున మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతోపాటు బ్యూరోక్రాట్ దాసరి శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది. వీరిద్దరిలో ఒకరికి పదవి ఖాయం అంటున్నారు.

ఇక తాజాగా తిరుపతి ఉప ఎన్నిక కోసం బీజేపీ-జనసేన అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరు బలంగా వినిపిస్తోంది. ఏపీకి చెందిన ఈమె రిటైర్ మెంట్ తర్వాత బీజేపీలో చేరారు. కర్ణాటక బీజేపీలో కీలక నేతగా గుర్తింపు పొందారు.
Tags:    

Similar News