నితీష్ మంత్రివర్గంలో బీజేపీదే డామినేషన్

Update: 2020-11-17 18:29 GMT
బీహార్లో కొత్తగా ఏర్పడిన నితీష్ కుమార్ మంత్రివర్గంలో బీజేపీదే డామినేషన్ అని తేలిపోయింది. కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో నితీష్ కాకుండా మరో 14 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు బీజేపీ నుండి ఐదుగురు మంత్రులు జేడీయు నుండి ఉన్నారు. మిగిలిన హెచ్ఏఎం, విఐపి పార్టీల నుండి చెరోకరికి మంత్రిపదవులు దక్కాయి. దాంతో ఏడుగురు మంత్రులుండటంతో బీజేపీ డామినేషన్ అర్ధమైపోతోంది.

నితీష్ కుమార్ కు హోంశాఖ, సాధారణ పరిపాలనా శాఖ, విజిలెన్స్ తో పాటు ఇతర మంత్రులకు కేటాయించిన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి.

తారా కిషోర్ ప్రసాద్ (బీజేపీ) దగ్గర డిప్యుటి సిఎంతో పాటు ఆర్ధికశాఖ, ఐటి, వాణిజ్యపన్నులు, అటవీ, ప్రకృతి విపత్తు నిర్వహణ శాఖ, పట్టాణిభివృద్ధి శాఖలున్నాయి.

రేణుదేవీ (బీజేపీ) ఉపముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయితీ రాజ్ , వెనుకబడిన తరగతుల సంక్షేమం, పరిశ్రమల శాఖ చూస్తున్నారు.

మంగళ్ పాండే (బీజేపీ) ఆరోగ్యశాఖ, కళలు, సాంస్కృతిక శాఖలు

రామ్ సూరత్ రాయ్ (బీజేపీ) న్యాయ, రెవిన్యు శాఖలు

అమరేంద్ర ప్రతాప్ సింగ్ (బీజేపీ) వ్యవసాయం, సహకార, షుగర్ శాఖలు

జీవేష్ మిశ్రా (బీజేపీ) గనులు, పర్యాటకం, లేబర్ శాఖలు

రామ్ ప్రీత్ పాశ్వాన్ (బీజేపీ) పబ్లిక్ హెల్త్,  ఇంజనీరింగ్ శాఖలు

బిజేంద్ర యాదవ్ (జేడీయు) ఇంధన, ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, ప్రణాళిక శాఖలు

అశోక్ చౌదరి (జేడీయు) మైనారిటి, సామాజిక సంక్షేమ శాఖ, బిల్గింగ్ నిర్మాణ శాఖ

మేవాలాల్ చౌదరి (జేడీయు) విద్యాశాఖ

సంతోష్ మాంజీ (హెచ్ఏఎం) మైనర్ ఇరిగేషన్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు

ముఖేష్ సాహ్ని(విఐపి) పశు సంవర్ధక, మత్స్య శాఖలు
Tags:    

Similar News