ఢిల్లీ కోరిక ఒకటి...గల్లీ వాస్తవం మరొకటి
అధికార పీఠానికి చేరువ కావాలన్న ఏ రాజకీయ పార్టీ అయిన ప్రభుత్వ విధానాలపై పోరాటం చేసినప్పుడే ఆ పార్టీకి జనాదరణ వస్తుంది. కానీ ఏపీలోని బీజేపీ నేతలు అటు అధికారపక్షానికి మిత్రపక్షంగా ఉండలేక ఇటు స్వతహాగా ప్రతిపక్షంగా వ్యవహరించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతహాగా ఎదగాలని యోచిస్తున్న బీజేపీ అందుకు తగ్గ అస్త్రాలను సిద్దంచేసుకోవడంలేదన్న రుసరుసలు ఆ పార్టీ శ్రేణులనుంచే వ్యక్తమవుతున్నాయి. అధికార టీడీపీపై ఏపీ బీజేపీలోని ఒక వర్గం గుర్రుగా ఉన్నా ఇంకో వర్గం ప్రదర్శిస్తున్న సానుకూలత వల్ల రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందన్న విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేతలు విమర్శలు చేసినప్పుడు వారిని తిప్పికొట్టేందుకు తప్ప మిగితా సమయాలలో అధికార పక్షంపై బీజేపీ దూకుడు పెంచలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలున్నా వాటిపైనా ఆ పార్టీ పోరాటం చేయడంలేదని విమర్శలున్నాయి. స్వతహాగా పోరాట పంథాను రూపొందించుకోలేకపోతున్న ఏపీ బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రచారం చేసుకోవడానికే పరిమితమవుతోంది. ఈ పరిస్థితుల్లో మున్ముందు తమ భవిష్యత్తు ఏమిటీ అన్న బెంగ ఆ పార్టీ క్షేత్రస్థాయి నేతల్లో నెలకొంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఏపీలో తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ప్రకటించారు. బీజేపీ స్వతహాగా బలపడుతుందని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో అధికారంలో టీడీపీతో కలిసి బీజేపీ భాగస్వామ్యం పంచుకొన్నా ప్రభుత్వ విధానాలపై మాత్రం ఆ పార్టీ పోరాడుతుందన్న సంకేతాలు నాడు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇచ్చారు. కానీ నేడు అందుకు భిన్నమైన పరిస్థితి కొనసాగడంపై ఏపీ బిజెపి నేతల్లో నైరాశ్యం నెలకొంది. టీడీపీ ప్రభుత్వ విధానాలపై ఇతర ప్రతిపక్షాలు పలు అంశాలలో పోరాటాలు చేస్తున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంలోని బిజెపి - రాష్ట్రంలోని టీడీపీ సర్కార్ పైనా ఇతర ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. అయితే బీజేపీకి ప్రత్యేకహోదా అంశంపై నొరెత్తే అవకాశం లేకున్నా టీడీపీ సర్కార్ కు చెందిన ఇతర విధానాలపై గళ్లం ఎత్తే అవకాశాలు లేకపోలేదన్న వాదన ఆ పార్టీ నేతల్లోనే ఉంది. అయితే ఇటీవల టీడీపీ సర్కార్ కొన్ని ఆలయాల కూల్చివేతల నిర్ణయం తీసుకొన్నప్పుడు పోరాడటం తప్ప బీజేపీ ఏపీ నాయకత్వం ఇతర ప్రజా సమస్యలపై ఆ రకమైన ధోరణీని ప్రదర్శించలేదన్న విమర్శలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ బిజెపి నేతలే అంగీకరిస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వ నిర్ణయావల్ల క్షేత్రస్థాయిలో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వాటిపై గళం ఎత్తే అవకాశం మాత్రం తమకు దక్కడంలేదని బీజేపీకి చెందిన కిందిస్థాయి నేతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. కేంద్రంపై టీడీపీ నేతలు ఎప్పుడైనా విమర్శలు చేస్తే వాటిని ప్రతిఘటించడం తప్పా ఆ ప్రభుత్వ విధానాలపై తాము పోరాడలేని దుస్థితి అని బీజేపీ నేతలే స్వయంగా వ్యాఖ్యనిస్తున్నారు. ఏపీలో స్వతహాగా బలపడాలంటే ప్రతిపక్ష పాత్రను పోషించక తప్పదని బీజేపీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వం ఓ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్రాలలో టీడీపీ-బీజేపీ అధికార భాగస్వాములైనా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పార్టీలు స్వతహాగా పోరాటం చేసే స్వేచ్చ ఇవ్వాలని కొందరు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. లేకపోతే ఏపీలో బీజేపీ స్వతహాగా ఎదగకపోగా తోకపార్టీగా మిగిలే ప్రమాదముందని చెబుతున్నారు. ఏపీలో బలపడాలని భావిస్తున్నప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వం స్వతహాగా ఈ రాష్ట్రంలో ప్రత్యేక కార్యచరణను ప్రకటిస్తే ప్రయోజనం కలుగుతుందని వారు పేర్కొంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/