ఏపీలో బీజేపీ ఒంటరి పోరు
మొన్నటి ఎన్నికల్లో కలిసి పోటీ చేసి విజయం అందుకున్న టీడీపీ, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో మళ్లీ కలిసి పోటీచేసే సూచనలు కనిపించడం లేదు. భారీగా ఉన్న నరేంద్రమోడీ ఇమేజిని క్యాష్ చేసుకునేందుకు గాను టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈసారి కూడా కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్నప్పటికీ బీజేపీ మాత్రం అందుకు విముఖంగా ఉందని తెలుస్తోంది.
ఏపీలో కలిసి పోటీ చేస్తే టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్నిటికే పోటీ చేయాలి. కానీ, సొంతంగా పోటీ చేస్తే ఇప్పుడున్న సీట్లు గ్యారంటీగా రావడంతో పాటు అదనంగానూ వచ్చే అవకాశాలుంటాయి. అంతేకాదు.. మొత్తం అన్ని సీట్లకూ పోటీ చేస్తే తమ సత్తా ఎంతో కూడా తెలుస్తుందని బీజేపీ భావిస్తోంది. అయితే... ఇదే సమయంలో కొన్ని సీట్ల విషయంలో టీడీపీతో స్నేహం మేరకు ఒప్పందాలు, అవగాహనలు ఉంటాయని తెలుస్తోంది.
కాగా ఈ నెల 25న అమిత్ షా ఏపీకి రానున్నందున ఆ రోజు ఈ విషయంలో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. అయితే... బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలనుకున్నట్లు తెలియగానే టీడీపీలో ఆందోళన పెరుగుతోంది. ఇలా చేయడం వల్ల ఓట్లు చీలి వైసీపిక మేలు జరుగుతందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/