• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీజేపీ ఎత్తుగడ.. కాపునేత...

బీజేపీ ఎత్తుగడ.. కాపునేత ముద్రగడ.. కండీషన్స్ మాటేమిటి?

By - Tupaki Desk
Update: 2021-01-19 15:30 GMT
తెలంగాణలో బీజేపీ వేళ్లు ఎంతగా నాటుకున్నాయన్నది తెలియదుగానీ.. కొంత ఊపయితే వచ్చిందాపార్టీకి. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. దీంతో.. అక్కడ కూడా పార్టీలో కదలిక తేవాలని అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి గాలం వేస్తోంది. ఆయనతో ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు భేటీ అయ్యారు. వారు చెప్పిన మాటలను బట్టి ముద్రగడకు కాషాయ తీర్థం పట్టించాలని ప్రయత్నిస్తున్నారనే విషయం అర్థమైంది. అయితే.. ఆ ప్రయత్నం ఎంత వరకు వచ్చింది? బీజేపీలో చేరేందుకు ముద్రగడ సుముఖంగా ఉన్నారా? ఆయన పెట్టిన షరతులు ఏంటి? అన్నవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ప్రశ్నలు.

ఆ సామాజిక వర్గంపై చూపు..
ఏపీలో జనాభా పరంగా కాపు సామాజికవర్గం బలంగానే ఉంటుంది. ముందుగా వారిని తమవారు అనిపించుకుంటే.. మిగిలిన వారిని ఇతర మార్గాల ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడ. ఇందులో భాగంగానే  జనసేనకు అండగా ఉంటోందని టాక్. ఒకవేళ రేపు ఏదైనా కారణంతో జనసేన దూరం జరిగితే.. కాపు సామాజికవర్గం ఓటర్లు జారిపోకుండా ముద్రగడను చేతిలో ఉంచుకుంటోందన్నది విశ్లేషకుల మాట. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లిన ముద్రగడ.. తనపై సోషల్‌ మీడియాలో వచ్చిన ఆరోపణలకు మనస్తాపం చెంది నాయకత్వం నుంచి వైదొలిగారు. అయితే.. బీజేపీలో చేరేందుకే ఇలా చేశారనే చర్చ సాగింది. ఇప్పుడు ఎలాగైనా కాషాయ కండువా కప్పాలని బీజేపీ భావిస్తోంది.

ప్రధాన హామీ అదేనా..?
ముద్రగడ బీజేపీలో చేరితో రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం సాాగుతోంది. ఈ విషయంలో నమ్మకం కుదర్చడానికి RSS సీనియర్‌ నేతతో మాట్లాడించారట సోము వీర్రాజు. గతంలో ఆంధ్రప్రాంతంలో పనిచేసిన ఆ సంఘ్‌ నేతతో గతంలోనే ముద్రగడతో పరిచయం ఉంది. పద్మనాభం కూడా ఒకప్పుడు బీజేపీలో పనిచేశారు. ఆ సమయంలో కాకినాడ నుంచి సినీ నటుడు కృష్ణంరాజును బీజేపీ ఎంపీగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారనే పేరుంది.

లిఖిత పూర్వకంగా కోరారా?
అయితే.. ముద్రగడ ఏ పార్టీలో చేరాలనుకున్నా కాపులకు ఏం చేస్తారో చెప్పాలని లిఖిత పూర్వక హామీ కోరతారట. తాజా.. భేటీలోనూ ఇదే అడిగారని సమాచారం. పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న కాపుల రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని, అది చేస్తే అట్టహాసంగా బీజేపీలో చేరతానని అన్నారట కాపునేత. అంతేకాకుండా.. కోస్తాలో తన అనుచరవర్గానికి ఎన్నికల్లో కొన్ని టికెట్లు కోరే అవకాశం కూడా ఉందట. ఇలా మరికొన్ని షరతులు కూడా ఉన్నాయట. మరి.. వీటికి బీజేపీ ఓకే అంటుందా? ముద్రగడ బీజేపీలో చేరతారా లేదా? అన్నది చూడాలి.
Tags:    
  • BJP 
  • Mudhragada Padmanabham 
  • Latest News 
  • Tupaki News 
  • AP Politics 
  • Telugu News 
  • Tupaki Updates 
  • Daily Updates 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS