• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మైక్రోసాఫ్ట్ నుంచి బిల్...

మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ ఇందుకే వైదొలిగాడట

By - Tupaki Desk
Update: 2020-03-14 19:30 GMT
బిల్ గేట్స్.. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు పురుడు పోసిన అపర మేధావి. 26వ ఏటనే మైక్రోసాఫ్ట్ ను స్థాపించాడు. 1976 మార్చి 13న పబ్లిక్ కంపెనీగా అయిన మైక్రోసాఫ్ట్ లో డైరెక్టర్ బోర్డులో కొనసాగుతూ వచ్చాడు. సరిగ్గా అదే రోజున మార్చి 13 2020న మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ తప్పుకోవడం విశేషం.

తాజాగా తన కలల కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగడానికి గల కారణాలను బిల్ గేట్స్ లింక్డ్ ఇన్ సోషల్ మీడియా ఫ్టాట్ ఫామ్ లో పంచుకున్నాడు. తన శేష జీవితాన్ని గ్లోబల్ హెల్త్, అభివృద్ధి, విద్య వంటి రంగాలకు, ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించేందుకే తాను మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వాతావరణ మార్పులపై పెరుగుతున్న భూతాపం తగ్గించడం పై కృషి చేస్తానని బిల్ గేట్స్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. డైరెక్టర్ల బోర్డునుంచి వైదొలిగినంత మాత్రాన తాను మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి వైదొలగడం లేదని.. ఈ సంస్థతో తనకు జీవితకాల ప్రస్థానం ఉందని బిల్ గేట్స్ తెలిపారు.

ఇక తాను ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రించేందుకు అడుగులు వేస్తున్నట్టు బిల్ గేట్స్ తెలిపారు. కరోనా వైరస్ నివారణకు ప్రపంచ దేశాలు జరుపుతున్న పోరాటంలో తాము కూడా భాగస్వాములం అవుతామని బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్ గేట్స్ ప్రకటించారు. ఇందుకోసం 100 మిలియన్ డాలర్ల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యాధి నివారణకు పరిశోధనలు చేస్తున్న వారికి సహాయం చేస్తామని.. వాక్సీన్ తయారీకి అయ్యే ఖర్చును తాము విరాళంగా ఇచ్చిన మొత్తం నుంచి అందుకోవచ్చని బిల్ గేట్స్ ప్రకటించారు.

ఇక సీఈవో సత్యనాదెళ్లపై ప్రశంసలు కురిపించారు. సత్య హయాలో మైక్రోసాఫ్ట్ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిందన్నారు.

ఇక బిల్ గేట్స్ వైదొలిగినప్పటికీ ఆయనకు కంపెనీ లో 1.3శాతం వాటాలున్నాయి. సుమారు 16బిలియన్ డాలర్లు విలువైనవి.
Tags:    
  • Bill Gates steps down from Microsoft board 
  • Bill Gates resigns from Microsoft 
  • Bill Gates 
  • Microsoft 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సోనియా ఆత్మ‌కథ‌: జ‌నాల్లో క్రేజ్ ఎలా ఉందంటే!

2026-11-11 18:30 GMT

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

Copyright @2026

Powered by Blink CMS