బీహార్ ప్రచారంలో మోడీ సరికొత్త ఎత్తులు
బీజేపీ పెద్ద, ప్రధాని నరేంద్రమోడీ ఏం చేసినా కొత్తగా చేస్తాడు. ట్రెండ్ సృష్టిస్తాడు..కానీ ఫాలో అవ్వడు.. కరోనా, లాక్ డౌన్ తో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న వేళ మళ్లీ తన పాత అస్త్రాన్ని బీహార్ ఎన్నికల్లో తీశాడు. అభివృద్ధి నినాదాన్ని పక్కనపెట్టి ప్రజాస్వామ్య ఉత్సవమని.. దోపిడీ వారికి పగ్గాలు అప్పజెప్పవద్దంటూ పరోక్షంగా ఆర్జేడీకి ఓటు వేయవద్దని సెంటిమెంట్ రాజకీయాలను తెరపైకి తెచ్చాడు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి విజయం కోసం ప్రసంగించిన మోడీ.. ప్రజలు మళ్లీ ఎన్డీఏను ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు . నితీశ్ కుమార్ - బీజేపీ జేడీయూ భాగస్వామ్యంతో ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవిని కట్టబెట్టాలని అభ్యర్థించారు. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ నితీష్ కుమార్‌తో వేదికను పంచుకోవడం విశేషం.
బీహార్‌లో ఈ రోజు ఫైనల్ వార్ జరుగుతుండగా.. నేడు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు . ఓటర్లు పెద్ద సంఖ్య లో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని కొత్త రికార్డు సృష్టించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం ట్వీట్ చేశారు. ‘బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో మూడో మరియు చివరి దశ పోలింగ్ లో ఓటర్లందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని కొత్త రికార్డు సృష్టించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆయన ట్విట్టర్ వేదిక గా స్పష్టం చేశారు . అందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం నిబంధనలు పాటించి కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
మరోవైపు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా బీహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థించారు. ‘నేడు బీహార్ లో చివరి దశ ఓటింగ్ జరుగుతోంది. కోవిడ్ యొక్క జాగ్రత్తలను దృష్టిలో ఉంచుకుని బీహార్ పురోగతికి సాధ్యమైనంతవరకు ఓటు వేయడం ద్వారా ఓటర్లందరూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను’ అంటూ బీజేపీ నడ్డా పిలుపునిచ్చారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా నడుస్తోంది. ఇప్పటికే తొలి దశ, రెండో ఎన్నికలు ముగియగా.. నేడు మూడో దశ పోలింగ్ నడుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 71 స్థానాల్లో తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. సెకండ్ ఫేస్‌లో మరో 94 నియోజకవర్గాలకు, మూడో విడత పోలింగ్ 78 నియోజకవర్గాల్లో జరుగుతోంది.బీహార్ లో 15 జిల్లాల్లో ఉన్న 2.3 కోట్లకు పైగా ఓటర్లు ఈ రోజు ఓటు వేయడానికి బారులు తీరుతున్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, మావోయిస్టు దెబ్బతిన్న ప్రాంతాలలో మినహా పోలింగ్ సమయాన్ని ఒక గంట పొడిగించారు. మరోవైపు ఈ ఎన్నికలే తనకు చివరివి అంటూ ఇప్పటికే నితీశ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబెడుతారా అని ఆసక్తి నెలకొంది.