ట్రంప్ సర్కార్ కి బిగ్ షాక్ ... ఆ ఆదేశాలు కొట్టేసిన అమెరికా కోర్టు
అమెరికాలో ఉద్యోగం అనేది చాలా దేశాల యువత కల. ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అమెరికా వెళ్లి ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగం చేసే వారు కొందరైతే , ఉద్యోగం కోసమే అమెరికా వెళ్లేవారు కొందరు. అయితే స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పం తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. ప్రతి ఏడాది ఇచ్చే హెచ్ 1బీ వీసాల్లో భారీగా కోత విధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పట్లో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం భారతీయులపై తీవ్రంగా చూపించింది. అయితే , ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ట్రంప్ జో బైడెన్ పై ఓటమి చెందిన నేపథ్యంలో ఆ ఆదేశాలను ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి కొట్టేయడం సంచలనం రేపుతోంది.
ప్రతి ఏడాది భారత్ తో పాటు ఇతర విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్ 1బీ వీసాల్లో కోత విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మేరకు వెలువడిన ఆదేశాలను అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తాజాగా కొట్టేశారు. నిజానికి అమెరికా ఏటా టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో కలిపి దాదాపు 85 వేల వీసాలను ఇస్తుంది. ఇవి మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత వీటిని రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అమెరికాలో హెచ్ 1బీ వీసాలు పొందిన వారిలో 6 లక్షల మంది భారత్, చైనాకు చెందిన వారే ఉన్నారు.
కానీ, ట్రంప్ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ ఏడాది చివరి వరకూ హెచ్ 1బీ వీసాలు విడుదల చేయకుండా నిషేధం విధించారు. అయితే, ఈ నిర్ణయాన్ని అమెరికాలోని పలు ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు కోర్టుల్లో సవాల్ చేశాయి. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వెల్లడించింది. దీనితో జో బైడెన్ బైడెన్ ప్రభుత్వం త్వరలో ఈ వీసాల పునరుద్ధరణకు అవకాశం దక్కింది. ఒకవేల ఈ వీసా జారీకి జో బైడెన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారత నిపుణులకు మంచి అవకాశాలు దొరికే ఛాన్స్ ఉంది.