సీఎం జగన్ కోసం కొత్త కాన్వాయ్

Update: 2019-06-17 06:42 GMT
ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ లో కొత్త మార్పు వచ్చింది. ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. జగన్ కాన్వాయ్ లో పాత చంద్రబాబు హయాంలో ఉన్న సోమ్ వాహనాలే ఇన్నాళ్లే ఉండేవి. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఈ సోమ్ వాహనాలతో భద్రత ఉండదని ఫ్యార్చ్యూనర్ ను కేటాయించాలని కోరినా చంద్రబాబు మాత్రం పెడచెవిన పెట్టారు.

ఇప్పుడు జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇదివరకు వాడిన సోమ్ వాహనాలను హైదరాబాద్ పంపించారు. అక్కడికి వెళితే వాహనశ్రేణిగా ఉంచాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు జగన్ కాన్వాయ్ లోని ఆరు అత్యాధునిక ఫ్యార్చునర్ నల్లటి రంగు వాహనాలు వచ్చి చేరాయి. ఏపీ 39 పీఏ 2345 పేరుతో ఈ నలుపు రంగు కార్లకు ఒకే నంబర్ ను అధికారులు కేటాయించారు.

సీఎం కేసీఆర్ కు కూడా ఇదే ఫ్యార్చ్యూనర్ వాహనాలను వినియోగిస్తారు. భద్రత, బుల్లెట్ ఫ్రూఫ్ పరంగా ఇవి అత్యంత నాణ్యమైనవి. చాలా మంది సీఎంలు కూడా వీటినే ఫ్రివర్ చేస్తుంటారు. ఇప్పుడు జగన్ కూడా ఈ వాహనాలనే తన కాన్వాయ్ భద్రతలో వినియోగించడం విశేషం.


Tags:    

Similar News