బిగ్ బ్రేకింగ్ : ‘బోరిస్ జాన్సన్’ భారత్ పర్యటన రద్దు !
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశంలో కరోనా వైరస్ న్యూ స్ట్రెయిన్ ప్రభావంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన నేపథ్యంలోనే బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది.
ప్రతి ఏడాది జనవరి 26వ తేదీన భారత్ రిపబ్లిక్ డే వేడుకలకు ఒక విదేశీ అదినేతను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగానే ఈ ఏడాది రిపబ్లిక్ డే దినోత్సవాలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ముఖ్య అతిథిగా హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించారు. మోదీ ఆహ్వానాన్ని బోరిస్ జాన్సన్ అంగీకరించారు కూడా. అయితే , ప్రస్తుతం బ్రిటన్ లో కరోనా కేసులు మళ్లీ ఉధృతం అవుతుండటంతో గత నెలలోనే భారత్ లో బోరిస్ జాన్సన్ పర్యటన అనుమానమేనని అధికార వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన పర్యటనను వాయిదా వేసుకున్న సంగతిని భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌లో బోరిస్ జాన్సన్ చెప్పారని జాన్సన్ అధికార ప్రతినిధి తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారన్న విషయం పై సందిగ్ధత నెలకొంది.